ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను సవరించాలి

ABN , First Publish Date - 2022-02-26T05:33:07+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌ ప్రజా వ్యతిరేకమైనదని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఏ వెంకటస్వామి ఆరోపించారు.

ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను సవరించాలి
జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న సీపీఎం, సీఐటీయూ నాయకులు

- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి 
గద్వాల టౌన్‌/ అలంపూర్‌ చౌరస్తా, ఫిబ్రవరి 25 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌ ప్రజా వ్యతిరేకమైనదని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఏ వెంకటస్వామి ఆరోపించారు. పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ శక్తులకు లాభం చేకూర్చి, పేద ప్రజలపై భారం మోపేదిగా ఉన్న ఈ బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యం లో శుక్రవారం జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాతబస్టాండ్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో వెంకటస్వామి మాట్లాడుతూ పబ్లిక్‌రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలకు భద్రత లేకుండా చేసిన బడ్జెట్‌లో లోటుగా పేర్కొన్న రూ.18 లక్షల కోట్ల ఆదా యాన్ని సమకూర్చుకునే మార్గంపై స్పష్టత లేదన్నారు. దీంతో భవిష్యత్తులో పేదలపై మరింత భారం పడే ప్రమాదం ఉందన్నారు. ఆందోళనలో జిల్లా కమిటీ కార్యదర్శి వీవీ నరసింహ, ఉప్పేరు నరసింహ, మల్లేష్‌, రంగన్న, రాజు, వెంకటేష్‌, రాజేష్‌, తిరుపతి, ఆంజ నేయులు, బద్రి పాల్గొన్నారు. 

- ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతాంగానికి నిరుపయోగమని తెలంగాణ రైతు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న అన్నారు. అయన ఆధ్వర్యంలో సీఐటీయూ నాయకులు అలంపూర్‌ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈద న్న మాట్లాడుతూ బడ్జెట్‌ను కార్పొరేట్‌ సంస్థలకు అనుగుణంగా రూపొందించారని విమర్శించారు. ఉపాధిహామీ పథకానికి సరైన కేటాయింపులు జరగలేదని ఆరోపించారు. రైతులకు సబ్సిడీ కింద ఇచ్చే పనిముట్లకు మంగళం పాడారన్నారు. కార్యక్రమంలో నాయకులు సింగరాజు, మద్దిలేటి, వెంకట్రాముడు, ఖాజహుస్సేన్‌, నీలకంఠం, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-26T05:33:07+05:30 IST