జిల్లాకు 200 మంది రాక

ABN , First Publish Date - 2020-03-30T10:41:17+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రతరం కాకుండా జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు జిల్లా

జిల్లాకు 200 మంది రాక

శ్రీకాకుళం క్రైం, మార్చి 29 : కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రతరం కాకుండా జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికారులు  చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు ఆదివారం అర్థరాత్రి ఇతర ప్రాంతాల నుంచి 200 మంది జిల్లాకు  నాటికి వస్తునట్లు అధికారులకు ముందస్తు సమాచారం అం దింది. వారందరినీ క్వారంటైన్‌లో ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈమేరకు సర్వజనాస్పత్రి పాటు సింగుపురం సమీపంలోని వైష్ణవీ కళాశాలలో వారిని ఉం చేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.


ఇదిలా ఉండగా..  ప్రజలు నగ రంలో అనవసరంగా సంచరించకుండా ఉండేందుకు  ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి తమ బలగాలను పెంచాలని ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 5 గంటల నుంచే కట్టుదిట్టంగా ఆంక్షలు అమలు చేయాలని జిల్లా పోలీసు అధి కారులకు ఎస్పీ సూచించారు. అలాగే పలు ప్రాంతాల నుంచి వచ్చే వారిపై ప్ర త్యేక నిఘా పెంచాలని  సూచించారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నగరంలో రహదారులు, జాతీయ రహదారిపై ఆయన పర్యటించారు. ఆయనతో పాటు  అదనపు ఎస్పీ పి.సోమశేఖర్‌ ఉన్నారు. 

Updated Date - 2020-03-30T10:41:17+05:30 IST