ఎంపీ అరవింద్‌పై దాడి సిగ్గుచేటు

ABN , First Publish Date - 2022-01-29T06:31:51+05:30 IST

నిజమాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జరిగిన దాడి సిగ్గుచేటని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జర్పుల కళ్యాణ్‌నాయక్‌ అన్నారు.

ఎంపీ అరవింద్‌పై దాడి సిగ్గుచేటు
త్రిపురారంలో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు

 బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నేతలు 

సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మల దహనం 

చింతపల్లి, జనవరి 28: నిజమాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జరిగిన దాడి సిగ్గుచేటని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జర్పుల కళ్యాణ్‌నాయక్‌ అన్నారు. అరవింద్‌పై టీఆర్‌ఎస్‌ నేతల దాడిని నిరసిస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చింతపల్లి ఎక్స్‌రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్‌ నాయక్‌ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకుంటున్న అరవింద్‌పై కొంతమంది టీఆర్‌ఎస్‌ గూండాలు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో నల్లగొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కూడా దాడి జరిగిందన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శివర్ల రమే్‌షయాదవ్‌లు, సీనియర్‌ నేతలు దావ శ్రీనివాసులు, సర్పంచ్‌లు బొడ్డు శ్రీనివాస్‌, కాసోసు బ్రహ్మచారి, ఎంపీటీసీ ఎగిరిశెట్టి  అనిత, బొడ్డు మహే్‌షగౌడ్‌, కట్ట సైదులు, వెన్నం శేఖర్‌, కుక్కుడపు రామకృష్ణ, బాల్‌జంగయ్యగౌడ్‌ పాల్గొన్నారు. 

త్రిపురారం: ఎంపీ అరవింద్‌పై దాడికి నిరసనగా మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో కేసీఆర్‌ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్సింగ్‌ యాదగిరి, జిల్లా కార్యదర్శి కటకం మల్లికార్జున్‌, సీనియర్‌ నాయకులు సమర్ధపు నరసింహ, మండల ప్రధాన కార్యదర్శి చెదురుపల్లి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు కోటూరి వెంకటేశ్వర్లు, మహిళా మోర్చా అధ్యక్షురాలు సొల్లేటి నవ్య, యువ మోర్చా అధ్యక్షుడు పొనుగోటి హరీష్‌, నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-29T06:31:51+05:30 IST