అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-10T05:11:14+05:30 IST

మండల పరిధిలోని పంచమ నది సంగమం వద్ద కొలువై ఉన్న శ్రీకామాక్షి సమేత వైద్యనాథేశ్వర, లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం అంకురార్పణతో మొదలయ్యాయని ఆలయ ప్రధాన అర్చకుడు అకిల్‌ దీక్షితులు తెలిపారు.

అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పూజలు చేస్తున్న అర్చకుడు

వల్లూరు, మే 9: మండల పరిధిలోని పంచమ నది సంగమం వద్ద కొలువై ఉన్న శ్రీకామాక్షి సమేత వైద్యనాథేశ్వర, లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం అంకురార్పణతో మొదలయ్యాయని ఆలయ ప్రధాన అర్చకుడు అకిల్‌ దీక్షితులు తెలిపారు. ఉదయాన్నే విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం, దీక్షా బంధనం వేద పండితులకు ఆలయ ఈవో, చైర్మన్లు అందజేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. కరోనా నేపథ్యంలో అర్చకులు ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రదోష కాలంలో అంకురార్పణ కోసం పుట్ట వద్దకు వెళ్లి మేళతాళాలతో పుట్ట మన్ను తీసుకువచ్చి సుబ్రమణ్యేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు మేధి పూజను నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి మహా మంగళహారతి అందించి ప్రసాదాలను నైవేధ్యంగా స్వామివారికి అర్పించారు. కాగా, నేడు కొండపై, దిగువన సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని చెన్నకేశవస్వామి తిరుచ్చివాహనం, వైద్యనాథేశ్వర స్వామి తిరుచ్చి వాహనంపై అలంకరిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-05-10T05:11:14+05:30 IST