gym center: జిమ్ సెంటర్‌లో శిక్షణ పేరుతో నాలుగేళ్లుగా ట్రైనర్ నిర్వాకం.. ఇటీవల ఓ యువతికి శిక్షణ ఇచ్చే క్రమంలో అతడు చేసిన పనితో..
ABN , First Publish Date - 2022-10-12T02:11:10+05:30 IST
కొందరు తమ వృత్తిని అడ్డు పెట్టుకుని చేయరాని దారుణాలన్నీ చేస్తుంటారు. డబ్బుల కోసం కొందరు మోసాలు చేస్తే.. మరికొందరు మహిళలను ప్రేమ పేరుతో వేధిస్తుంటారు. ఇలాంటి..
కొందరు తమ వృత్తిని అడ్డు పెట్టుకుని చేయరాని దారుణాలన్నీ చేస్తుంటారు. డబ్బుల కోసం కొందరు మోసాలు చేస్తే.. మరికొందరు మహిళలను ప్రేమ పేరుతో వేధిస్తుంటారు. ఇలాంటి దారుణాలను బయటికి చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతుంటారు. కొన్నిసార్లు మాత్రం తెగించి ఎదురిస్తుంటారు. ఇటీవల ముంబైలో ఇలాంటి దారుణమే జరిగింది. జిమ్‌లో ట్రైనర్‌గా ఉన్న ఓ వ్యక్తి నాలుగేళ్లుగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఇలా చేయొద్దని చాలా మంది చెబుతున్నా పట్టించుకోలేదు. ఇటీవల ఓ యువతి పట్ల కూడా ఇలాగే ప్రవర్తించడంతో అతడి నిర్వాకం గురించి అందరికీ తెలిసింది. వివరాల్లోకి వెళితే..
ముంబై (Mumbai) వెస్ట్ మలాడ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ జిమ్ సెంటర్‌లో (Gym Center) పలువురు యువతులు, మహిళలు శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఆ జిమ్‌లో ఓ వ్యక్తి నాలుగేళ్లుగా ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. మొదట్లో బుద్ధిగా ఉన్న అతను.. రాను రాను అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించేవాడు. శిక్షణ ఇచ్చే క్రమంలో మహిళలను తాకరాని చోట తాకేవాడు. మొదట్లో ఎవరికీ అనుమానం రాలేదు. రోజూ ఇలాగే చేస్తుండడంతో కొందరికి అనుమానం కలిగింది. ఇలా చేయొద్దంటూ గట్టిగా మందలించారు. అయినా అతడి ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. ఇటీవల జిమ్ సెంటర్‌కు ఓ యువతికి వచ్చింది.
Sleep Experiment: నిద్రపోకుండా 30 రోజులు ఉండగలరా..? ఐదుగురు ఖైదీలపై శాస్త్రవేత్తల రహస్య ప్రయోగం.. 69 ఏళ్ల తర్వాత బయటపడిన దారుణం..
అప్పటి నుంచి ట్రైనర్.. ఆమెపై కన్నేశాడు. రోజూ శిక్షణ పేరుతో తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొన్ని రోజుల తర్వాత అతడు కావాలనే ఇలా చేస్తున్నాడని యువతికి అర్థమైంది. దీంతో పద్ధతి మార్చుకోవాలంటూ సూచించింది. అయినా అతడి బుద్ధి మాత్రం మారలేదు. అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటూ ప్రేమ పేరుతో వేధించేవాడు. దీంతో చివరకు యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జిమ్ సెంటర్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ట్రైనర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, గతంలో ఎంత మందిని ఇలా వేధించాడనే కోణంలో విచారణ చేస్తున్నారు.