భవన నిర్మాణ రంగం కుదేలు..!

ABN , First Publish Date - 2020-05-04T10:58:06+05:30 IST

భవన నిర్మాణ రంగం లాక్‌డౌన్‌తో కుదేలైంది. 45 రోజుల లాక్‌డౌన్‌ తర్వాత భవన నిర్మాణ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించినా నిర్మాణ రంగం ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు.

భవన నిర్మాణ రంగం కుదేలు..!

45 రోజుల తర్వాత ప్రారంభమైన పనులు

పెరిగిన ధరలతో సామాన్యులకు ఇక్కట్లు

రూ.500లకు చేరుకున్న సిమెంట్‌ బస్తా ధర

చుక్కలనంటిన ఇటుక ధర

అదే దారిలో స్టీల్‌, ఇసుక


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: భవన నిర్మాణ రంగం లాక్‌డౌన్‌తో కుదేలైంది. 45 రోజుల లాక్‌డౌన్‌ తర్వాత భవన నిర్మాణ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించినా నిర్మాణ రంగం ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికే ఆర్థికపరమైన ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. అయితే భవన నిర్మాణ రంగానికి సంబంధించిన స్టీల్‌, సిమెంట్‌, ఇటుక, ఇసుక ధరలు ఆసాంతం పెరిగిపోయాయి. దీంతో ఇప్పుడు సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇల్లు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. 


సామాన్యులకు సంకటం

భవన నిర్మాణ పనులను ప్రారంభించాలంటూ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కావాల్సిన ముడి పదార్థాలు అందుబాటులో లేవు. లాక్‌డౌన్‌ వల్ల అన్ని ప రిశ్రమలు మూతపడ్డాయి. 45 రోజుల తర్వాత తెరుచుకున్నప్పటికీ భవన నిర్మాణ రంగానికి పూర్తి స్థా యిలో కావాల్సిన ముడి పదార్థాలు అందేలా కనిపించడం లేదు. దీనిని సాకుగా చూపుతూ కొందరు వ్యా పారులు బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఒక్కో సిమెంట్‌ బ స్తా ధర రూ.350 ఉండగా ఇప్పుడు రూ.500లకు చే రుకుంది. హోల్‌సేల్‌ వ్యాపారులకు ఒక్కో సిమెంట్‌ బస్తా రూ.420కి ఇస్తున్నప్పటికీ స్టాక్‌ లేదంటూ కృ త్రిమ కొరత సృష్టిస్తూ రూ.500 నుంచి రూ.550కి వి క్రయిస్తున్నారు. స్టీల్‌ ధర కూడా క్వింటాల్‌కు రూ. 100 నుంచి రూ.300లకు పెరిగింది. ఒక్కో కంపెనీ స్టీల్‌ ధర క్వింటాల్‌కు లాక్‌డౌన్‌కు ముందు రూ. 4400 నుంచి రూ.4500 వరకు ఉండగా, ఇప్పుడు రూ.4600 నుంచి రూ.4800 వరకు చేరుకుంది.


ఇటు క ధర అయితే చుక్కలనంటుకుంది. కార్మికులు లాక్‌డౌన్‌ వల్ల పూర్తిగా పనులు నిలిపివేయడంతో ఇటుక బట్టీలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడక్కడ ఇటుక ఉన్నప్పటికీ వ్యాపారులు రేట్లు పెంచేశా రు. ఒక్కో ట్రాక్టర్‌ ఇటుక ధర రూ.13 వేల నుంచి రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముం దు జగిత్యాలలో ఇసుక క్వారీ ఏర్పాటు చేసి ప్రభుత్వపరంగా అమ్మగా, ఇప్పుడు అమ్మకాలు నిలిచిపోయా యి. లాక్‌డౌన్‌తో వాహనాల తనిఖీ ఎక్కువ కావడం తో అక్రమ ఇసుక రవాణా కూడా నిలిచిపోయింది. దీంతో ఒక్కో ట్రాక్టర్‌ ఇసుక ధర ఇప్పుడు రూ.5 వేలకు పెరిగింది. 


నిబంధనల అమలులో విఫలం

నిర్మాణ రంగంలో పనులు చేపట్టేటప్పుడు భౌతిక దూరం పాటించడంతో పాటు విధిగా మాస్క్‌లు ధ రించాలనే ఆదేశాలు ఉన్నాయి. పనులు జరుగుతు న్న చోట కార్మికులు ఉండేలా చర్యలు చేపట్టడంతో పాటు శానిటైజర్లు, ఇతర మెడికల్‌ కిట్లు కూడా అ క్కడే ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నాయి. కానీ ఎక్కడ కనిపించడం లేదు. దీనికితోడు ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు త మ ప్రాంతాలకు వెళ్లిపోయేలా అనుమతులు ఇవ్వ డంతో జిల్లాలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వల స కార్మికులు ఇంటిబాట పడుతున్నారు. 


ధరలు పెరుగడంతో ఇబ్బందికరంగా ఉంది..వెంకట్‌ నారాయణ, గృహ నిర్మాణదారుడు, జగిత్యాల

లాక్‌డౌన్‌ వల్ల స్టీల్‌, సిమెంట్‌, ఇటుక ధరలు బా గా పెరిగాయి. లాక్‌డౌన్‌కు ముందే ఇంటి పనులు మొదలుపెట్టాను. 45 రోజులుగా పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు అనుమతులు ఉన్నా పెరిగిన ధరలతో ఇల్లు కట్టలేని పరిస్థితి ఉంది. రూ.340 ఉన్న సిమెంట్‌ బస్తా ఇప్పుడు రూ.500లకు చేరింది.


కార్మికులతో కష్టంగా ఉంది..మచ్చ మాధవ్‌, మేస్త్రీ, జగిత్యాల

లాక్‌డౌన్‌ వల్ల మాలాంటి మేస్త్రీలకు కష్టంగా మా రింది. 45 రోజులు పని లేకపోవడంతో వారిని పో షించడం గగనంగా మారింది. ఇప్పుడు పనులు ప్రా రంభమైనా కార్మికులు ఉండటం లేదు. భవన నిర్మాణ పనులు ఈసారి పూర్తి స్థాయిలో జరిగేలా కనిపించడం లేదు.


Updated Date - 2020-05-04T10:58:06+05:30 IST