బస్సు ఢీకొని లారీ కిందికి దూసుకెళ్లిన కారు

ABN , First Publish Date - 2021-03-05T06:41:20+05:30 IST

మండలంలోని రాజీవ్‌ రహదారిపై నూతన కలెక్టరేట్‌ కార్యాలయం సమీపంలో కారును బస్సు వెనుకనుంచి ఢీకొనడంతో లారీ కిందికి దూసుకుపోయింది.

బస్సు ఢీకొని లారీ కిందికి దూసుకెళ్లిన కారు

కొండపాక, మార్చి 4: మండలంలోని  రాజీవ్‌ రహదారిపై నూతన కలెక్టరేట్‌ కార్యాలయం సమీపంలో కారును బస్సు వెనుకనుంచి ఢీకొనడంతో  లారీ కిందికి దూసుకుపోయింది. గురువారం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని చింత నెక్కొండ గ్రామానికి చెందిన బాలకిషన్‌రావు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ నుంచి సుల్తానాబాద్‌కు  కారులో బయలుదేరాడు.  కొండపాక మండలం దర్గా కమాన్‌ వద్ద ఓ లారీ యూటర్న్‌ తీసుకుంటుండగా కారును స్లో చేశాడు.  ఈ క్రమంలో  కారు వెనక వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కారును బలంగా ఢీకొట్టింది. దాంతో కారు  ముందుగా యూ టర్ను చేసుకుంటున్న లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు ముందుభాగం, వెనుక భాగం పూర్తిగా దెబ్బతిన్నది. కారులో  ఉన్నవారికి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. కుకునూర్‌ పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-05T06:41:20+05:30 IST