Abn logo
Apr 29 2021 @ 00:00AM

పిల్లుల కవాతు!

మీరు చాలా రకాల పండుగల గురించి విని ఉంటారు. కానీ బెల్జియంలోని ఏప్రెస్‌ నగరంలో జరిగే క్యాట్‌ ఫెస్టివల్‌ గురించి విన్నారా? ఆ పండగ విశేషాలు ఇవి....


  1. మే నెల రెండో ఆదివారం క్యాట్‌ పరేడ్‌ పేరుతో ఒక కవాతును నిర్వహిస్తారు. పిల్లుల మాదిరి వేషాలు వేసుకొని, నృత్యాలు చేస్తూ వీధుల్లో తిరుగుతారు. ఈ వేడుకను చూసేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీనిని ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ద క్యాట్‌’ అని కూడా పిలుస్తారు.
  2. ఒకప్పుడు ఏప్రెస్‌లో వస్త్రపరిశ్రమ బాగా విస్తరించి ఉండేది. ఇంగ్లండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఉన్నితో దుస్తులు తయారుచేసే వారు. అలా దిగుమతి చేసుకున్న ఉన్ని, తయారుచేసిన దుస్తులను క్లాత్‌హాల్‌లో భద్రపరిచేవారు. ఆ దుస్తులకు ఎలుకలు రంధ్రాలు చేసేవి. దాంతో వ్యాపారులకు నష్టాలు రావడం మొదలయింది. 
  3. ఎలుకల బెడదను నివారించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు పిల్లులను పెంచడం ప్రారంభించారు. ఒకానొక దశలో పిల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతో పిల్లుల సంఖ్య తగ్గించడానికి వాటిని చంపడం మొదలెట్టారు. అప్పటి నుంచి ఆ పద్ధతి కొనసాగుతూ వస్తోంది. పరేడ్‌ పూర్తయిన తరువాత స్థానికంగా ఉన్న టవర్‌పై నుంచి పిల్లులను కింద పడేస్తుంటారు.

Advertisement