బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌కు మతి భ్రమించింది

ABN , First Publish Date - 2021-10-23T05:23:54+05:30 IST

రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌కు మతిభ్రమించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథశర్మ అన్నారు.

బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌కు మతి భ్రమించింది
మాట్లాడుతున్న సాయినాథశర్మ

రాబోయే ఐదునెలల్లో చనిపోయేవారు రూ.10వేల కోసం ముందే దరఖాస్తు చేసుకోవాలా?

రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు సాయినాథశర్మ ధ్వజం


కమలాపురం(రూరల్‌), అక్టోబరు 22: రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌కు మతిభ్రమించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథశర్మ అన్నారు. కమలాపురంలో శుక్రవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేద బ్రాహ్మణులు మరణిస్తే ఆ కుటుంబాలకు రూ.10 వేల ఆర్థికసాయం అందించేలా గతంలో టీడీపీ గరుడ పథకం ప్రవేశపెట్టిందన్నారు. అయితే గరుడ పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని గురువారం బ్రాహ్మణ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో ఆ సంస్థ చైర్మన్‌ పేర్కొన్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు మృతిచెందిన ఒక్క పేద బ్రాహ్మణ కుటుంబానికి కూడా గరుడ పథకం సహాయం అందలేదని, దాదాపు 3,600 దరఖాస్తులు నిలిచిపోయి ఉన్నాయన్నారు. రాబోయే అయిదు నెలల కాలంలో ఎవరైతే మృతిచెందుతామని భావిస్తారో అటువంటి అర్హులైన పేద బ్రాహ్మణులు దరఖాస్తు చేసుకోవాలని సూచించిన విషయం గమనిస్తే ఈ రాష్ట్రం పిచ్చితుగ్లక్‌ పాలనలో ఉందనే అనుమానం వస్తోందన్నారు.

Updated Date - 2021-10-23T05:23:54+05:30 IST