సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-08-01T05:12:39+05:30 IST

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి సకాలంలో పీఆర్సీని అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు డిమాండు చేశారు. చల్లవానిపేటలో శనివారం పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మా ట్లాడారు. ప్రభుత్వం బకాయి పడిన ఆరు విడతల డీఏను తక్షణం విడుదల చేయాలన్నారు.

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు

మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు

చల్లవానిపేట (జలుమూరు): సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి సకాలంలో పీఆర్సీని అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు డిమాండు చేశారు. చల్లవానిపేటలో శనివారం పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మా ట్లాడారు. ప్రభుత్వం బకాయి పడిన ఆరు విడతల డీఏను తక్షణం విడుదల చేయాలన్నారు. నెలవారీ ప్రమోషన్సుకు మోక్షం కలిగించి ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బైరి అప్పారావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.రాజశేఖర్‌, బి.రవికుమార్‌, పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-08-01T05:12:39+05:30 IST