Abn logo
Jun 12 2021 @ 00:20AM

రైతును రాజుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దే

క్యూలైన్‌ కాంప్లెక్సు నిర్మాణం పనులపై సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల, జూన్‌ 11: సీమాంధ్రుల పాలనలో అరిగోసపడిన రైతును స్వరాష్ట్ర పాలనలో రాజుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరిరెడ్డి అన్నారు. చేర్యాల మండలం దొమ్మా ట గ్రామశివారులోని వాగులో రూ.2.99 కోట్ల వ్యయం తో నిర్మించతలపెట్టిన చెక్‌డ్యాం నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అంతకుముందు చేర్యాల మార్కెట్‌యార్డును సందర్శించారు. ఽరైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. యార్డులోని షెడ్ల ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగింజేశారు.  అలాగే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొమురవెల్లిలో పర్యటించారు. టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 31 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి ఇటీవల భక్తుల వసతుల కల్పన, ఆలయ అభివృద్ధి పనుల పట్ల చేసిన తీర్మానాల ప్రతిపాదిత స్థలాలను ఆలయ ఈవో బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్‌ భిక్షపతితో కలిసి పరిశీలించి పలు సూ చనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీలు కరుణాకర్‌, కీర్తన, జడ్పీటీసీ సిద్ధప్ప, పీఏసీఎస్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపరాణి, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement