దళితబంధు పథకాన్ని జిల్లాకు వర్తింపజేయాలి

ABN , First Publish Date - 2021-07-30T05:20:07+05:30 IST

దళితబంధు పథకాన్ని జిల్లాలో కూడా అమ లుచేయాలని కోరుతూ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కందుకూరి రాజరత్న య్య, ప్రధానకార్యదర్శి తాండ్ర సదానందం ప్రభుత్వాన్ని కోరుతూ గురువారం అదన పు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు.

దళితబంధు పథకాన్ని జిల్లాకు వర్తింపజేయాలి
అదనపు జేసీకి వినతిపత్రం ఇస్తున్న సదానందం

- దళిత హక్కుల పోరాట సమితి నాయకులు

పెద్దపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): దళితబంధు పథకాన్ని జిల్లాలో కూడా అమ లుచేయాలని కోరుతూ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కందుకూరి రాజరత్న య్య, ప్రధానకార్యదర్శి తాండ్ర సదానందం ప్రభుత్వాన్ని కోరుతూ గురువారం అదన పు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు విలే కరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న దళితబంధు పథకాన్ని జిల్లాలో ఉన్న దళిత నిరుపేదలందరికీ వర్తింపజేయాలన్నారు. ఈ పథకా న్ని హుజూరాబాద్‌ నియోజకవర్గానికే పరిమితం చేయకుండా జిల్లాలో కూడా అమ లుచేయాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తాన న్న సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూ మి ఇస్తానని చెప్పి ఆ పథకాన్ని కూడా సక్రమంగా అమలుచేయలేదని, కనీసం దళి తులకు డబుల్‌ బెడ్‌రూముల ఇళ్లు కూడా ఇచ్చిందిలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అ సలు దళితుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, హూజూరాబాద్‌ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే దళితబంధు పథకాన్ని తీసుకవచ్చినట్లుగా కనబడు తున్నదన్నారు. మొదట ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పిన సీఎం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాత్రం అన్ని దళిత కుటుంబాలందరికీ వర్తింపజేస్తున్నామని ప్రకటించారన్నారు. హుజూరాబాద్‌కే కాకుండా జిల్లాకు కూడా దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని వారు కోరారు.  

Updated Date - 2021-07-30T05:20:07+05:30 IST