మూడ్రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయని తల్లిదండ్రులు.. అనుమానంతో ముంబై నుంచి వచ్చి చూసిన కూతురు.. ఇంటి తలుపులు పగలగొట్టి చూస్తే..
ABN , First Publish Date - 2022-05-26T02:53:44+05:30 IST
వారికి ఇద్దరు పిల్లలు. కూతురికి వివాహం అవగా.. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఎలాంటి సమస్యలూ లేకపోవడంతో దంపతులిద్దరూ ప్రశాంత జీవనం గడుపుతున్నారు. పిల్లలు దూరంగా..
వారికి ఇద్దరు పిల్లలు. కూతురికి వివాహం అవగా.. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఎలాంటి సమస్యలూ లేకపోవడంతో దంపతులిద్దరూ ప్రశాంత జీవనం గడుపుతున్నారు. పిల్లలు దూరంగా ఉన్నా.. తరచూ తల్లిదండ్రులతో మాట్లాడుతూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు. అయితే ఇటీవల మూడు రోజులుగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తల్లిదండ్రుల నుంచి స్పందన లేదు. దీంతో వారి కూతురు ముంబై నుంచి చూడటానికి వచ్చింది. ఇంటి తలుపులు తీయకపోవడంతో చివరికి బద్దలు కొట్టి చూశారు. లోపల షాకింగ్ దృశ్యం కనిపించింది.
చెన్నై పరిధి పురుసివాల్కమ్ ప్రాంతం సైకిల్‌కారన్ వీధిలో అశోక్‌బాబు(53), పద్మిని దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కూతురికి వివాహమైంది. ప్రస్తుతం భర్తతో కలిసి ముంబైలో ఉంటోంది. అలాగే వీరి కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో అశోక్ బాబు తన భార్యతో కలిసి పురుసివాల్కమ్‌లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఎలాంటి ఆర్థిక సమస్యలూ లేకపోవడంతో సంతోషంగా జీవించేవారు. వీరి పిల్లలు దూరంగా ఉన్నా తరచూ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ, యోగక్షేమాలు తెలుసుకునేవారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా, తల్లిదండ్రుల నుంచి స్పందన లేదు.
ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ప్రియుడితో సీక్రెట్‌గా ఫోన్లో మాట్లాడుతున్న కూతురు.. ఓ రోజు రాత్రి తండ్రి చూసి..
దీంతో వారి కూతురు కంగారుపడి.. మే 21న ముంబై నుంచి వచ్చింది. అయితే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పాటూ ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి, పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టారు. లోపల కుళ్లిపోయిన భర్త మృత దేహం పక్కన మౌనంగా కూర్చుని ఉన్న భార్యను చూసి అంతా షాక్ అయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పద్మిని మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.