మెడికల్‌ కిట్ల పంపిణీ అభినందనీయం

ABN , First Publish Date - 2021-06-18T06:29:40+05:30 IST

కరోనా బాధి తులకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్‌ ఫో రం ఆధ్వర్యంలో మెడికల్‌ కిట్లు పంపిణీ చే యడం అభినందనీయమని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు అన్నారు.

మెడికల్‌ కిట్ల పంపిణీ అభినందనీయం
మెడికల్‌ కిట్టును అందిస్తున్న డీహెచ్‌ఎంవో సుమన్‌మోహన్‌రావు, రాజేశ్వర్‌రెడ్డి

- టీకా వేయించుకున్నా మాస్కులు ధరించాలి 

- డీఎంహెచ్‌వో సుమన్‌మెహన్‌రావు

ఎల్లారెడ్డిపేట, జూన్‌ 17: కరోనా బాధి తులకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్‌ ఫో రం ఆధ్వర్యంలో మెడికల్‌ కిట్లు పంపిణీ చే యడం అభినందనీయమని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు అన్నారు. ఎల్లా రెడ్డిపేట పీహెచ్‌పీలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర డె వలప్‌మెంట్‌ ఫోరం వారు సమకూర్చిన మాస్కులు, శానిటైజర్లు, మెడికల్‌ కిట్లను ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మట్ట రాజేశ్వర్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన అందించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ వో మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలకు సీ జనల్‌ వ్యాధులు, కొవిడ్‌పై చైతన్యవంతుల ను చేయాలన్నారు. ఇంటింటా తిరుగుతూ ఆరోగ్య సర్వే నిర్వహించి కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి కొవిడ్‌ పరీక్షలు చే యించాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు పా టిస్తూ కరోనా కట్టడికి సిబ్బంది కృషి చేయాలని సూచించారు. సంఘం ప్రధాన కా ర్యదర్శి మట్ట రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ  మొట్టమొదటగా ఎల్లారెడ్డిపేటలో మెడికల్‌ కిట్లను అందించామన్నారు. రానున్న రోజు ల్లో జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలలో పంపి ణీ చేస్తామని రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.  వైద్యాధికారులు ధర్మానాయక్‌, మానస, సీహెచ్‌వోలు స్రవంతి, స్వప్న, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T06:29:40+05:30 IST