Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘వారధి ఫౌండేషన్‌’ పోటీల్లో జిల్లాకు మూడో స్థానం

చిత్తూరు (సెంట్రల్‌), డిసెంబరు 7: పాఠశాల విద్యాశాఖ, వారధి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వ్యక్తిగత ప్రవర్తన, సమాజంపై సోషల్‌ మీడియా ప్రభావం అనే అంశంపై రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో జిల్లాకు మూడో స్థానం లభించింది. ఈ మేరకు మంగళవారం వెబ్‌ ద్వారా విజేతలను నిర్వాహకులు ప్రకటించారని జిల్లా సైన్స్‌ అధికారి వెంకటరమణ తెలిపారు. నాయబ్‌ హైమా (జడ్పీహెచ్‌ఎస్‌, మదనపల్లె), షహనాజ్‌ (జడ్పీహెచ్‌ఎస్‌, పలమనేరు), భవ్యశ్రీ (ఎస్వీ ఉన్నత పాఠశాల, తిరుపతి) తృతీయ స్థానంలో నిలిచారన్నారు. ఫౌండేషన్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ.9వేలతోపాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందజేస్తారని పేర్కొన్నారు. కాగా.. విజేతలను డీఈవో పురుషోత్తం, ఆయా పాఠశాలల గైడ్‌ టీచర్లు మహ్మద్‌ ఖాన్‌, హేమలత, ఉమా అభినందించారు. 

Advertisement
Advertisement