భర్తకు తెలీకుండా మాజీ సర్పంచ్‌తో ప్రేమాయణం.. రేయింబవళ్లు ఫోన్లలో బిజీ.. ఓ రోజు పార్కులో వాకింగ్ చేస్తుండగా..

ABN , First Publish Date - 2021-12-17T02:48:14+05:30 IST

కర్ణాటకలో ఓ మహిళ భర్తకు తెలీకుండా తన సొంతూరి మాజీ సర్పంచ్‌ను ప్రేమించడం మొదలెట్టింది. రోజూ ఫోన్లలో బిజీ బిజీగా తడుపుతుండేవారు. కొన్నాళ్లకు ఈ విషయం...

భర్తకు తెలీకుండా మాజీ సర్పంచ్‌తో ప్రేమాయణం.. రేయింబవళ్లు ఫోన్లలో బిజీ.. ఓ రోజు పార్కులో వాకింగ్ చేస్తుండగా..

భర్తను కాదని భార్యలు, భార్యకు తెలీకుండా భర్తలు చేసే పనులు చివరకు ఎంతో దూరం వెళ్తుంటాయి. మొదట్లో సవ్యంగా సాగిపోయినా.. చివరకు మాత్రం కథ అడ్డం తిరుగుతూ ఉంటుంది. కర్ణాటకలో ఓ మహిళ భర్తకు తెలీకుండా తన సొంతూరి మాజీ సర్పంచ్‌ను ప్రేమించడం మొదలెట్టింది. రోజూ ఫోన్లలో బిజీ బిజీగా తడుపుతుండేవారు. కొన్నాళ్లకు ఈ విషయం స్థానికంగా అందరికీ తెలిసిపోయింది. భర్తకు తెలియడంతో వారి కుటుంబంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.. వివరాల్లోకి వెళితే..


బెంగళూరు పరిధి అనేకల్‌ సూర్యనగర్ సమీపంలోని బ్యగడదేనహళ్లికి చెందిన కావ్య(28) యువతికి సమీప గ్రామానికి చెందిన ముత్తురాజ్‌తో వివాహమైంది. అయితే కావ్య తన సొంతూరుకు వెళ్లే క్రమంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ నారాయణస్వామి (38)అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తర్వాత అతడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఏవేవో కారణాలు చెబుతూ తరచూ సొంతూరుకు వెళ్లడం, అక్కడే చాలా రోజులు ఉంటూ నారాయణ స్వామితో రాసలీలలు సాగించేది. కొన్నాళ్లకు ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోయింది.

బాత్రూమ్‌లో మరమ్మతు పనులు చేస్తున్న ప్లంబర్.. గోడలో ఏదో ఉన్నట్లు అనుమానం.. తీరా బద్దలు కొట్టి చూడగా..


ఈ విషయం భర్త ముత్తురాజ్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య రోజూ గొడవలు జరుగుతుండేవి. కావ్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో భార్య, నారాయణ స్వామిపై ముత్తురాజ్ పగ పెంచుకున్నాడు. కావ్య, ఆమె తల్లి ఇటీవల వాకింగ్‌కు వెళ్తుండగా గుర్తుతెలియని దండగులు ఆమెపై దాడి చేసి, హత్య చేశారు. మరోవైపు అదేరోజు నారాయణ స్వామి కూడా హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ముత్తురాజే ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

రూ.7499 విలువైన Geyser ను అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే.. పార్శిల్లో వచ్చిన వాటిని చూసి అవాక్కైన కస్టమర్

Updated Date - 2021-12-17T02:48:14+05:30 IST