ముగిసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-08-26T05:14:02+05:30 IST

మండలంలోని బోయిన్‌పల్లి ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి.

ముగిసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఉత్సవాలు
ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న గ్రామస్థులు

నారాయణపేట రూరల్‌, ఆగస్టు 25 : మండలంలోని బోయిన్‌పల్లి ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి వారికి పంచామృతాభిషేకం, అలంకరణ, హోమం, ధ్వజస్తంభ పూజ, రక్తాన్న బలి, ప్రతిష్ఠ, పూర్ణాహుతి నిర్వహించి భక్తులకు అన్నదానం చేపట్టారు. మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున చేరి మొక్కు బడులు చెల్లించుకున్నారు. టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు సదాశివారెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాములు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మహిళలు బొడ్డెమ్మలు వేశారు. రెట్టపట్ల కార్యక్రమం నిర్వహించారు.  సర్పంచ్‌ త్రివిక్రమరావు, ఉప సర్పంచ్‌ నర్సప్ప, గ్రామ పెద్దలు భరత్‌రాజ్‌, వెంకటేశ్వర్‌రావు, బాల్‌రాజ్‌, రాములు, నాగప్ప, వెంకటయ్య, మల్లేష్‌ యాదవ్‌, నర్సిములు, కేసీ మోహన్‌, రాములు పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని ఒండుచెలిమె తండాలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన నిర్వహించారు.  సర్పంచ్‌ నీలిబాయి, ఉప సర్పంచ్‌ సురేష్‌ నాయక్‌, లక్ష్మన్‌నాయక్‌, రవి, తిరుపతి, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-26T05:14:02+05:30 IST