రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

ABN , First Publish Date - 2022-01-27T05:18:25+05:30 IST

గణతంత్ర వేడుక లను బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వ హించారు.

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ హరిచందన

- నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు  

- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌ హరిచందన

- హాజరైన ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు

నారాయణపేట టౌన్‌, జనవరి 26 : గణతంత్ర వేడుక లను బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ హరిచందన్‌ ఉదయం పది గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో కలెక్టర్‌ హరిచందనకు ఎస్పీ వెంకటేశ్వర్లు, అ దనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి పుష్పగుచ్చాలు అందించి స్వాగ తం పలికారు. అనంతరం కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళి అ ర్పించారు. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని సాదాసీదాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభు త్వం ఆదేశించింది. ఈ మేరకు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో అదన పు ఎస్పీ భరత్‌, ఇన్‌చార్జి ఆర్డీవో నర్సింగ్‌రావు, ఖలీద్‌, కలెక్టరేట్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. అదే విధంగా మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అంకిత భావంతో పనిచేయాలి

నారాయణపేట క్రైం : రాజ్యాంగ బద్దంగా ప్రతి ఒక్క రం ముందుకు నడుచుకుంటూ అంకిత భావంతో పని చేసి జిల్లాను మంచి స్థాయికి తీసుకెళ్దామని ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాల యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఎస్పీ వెంక టేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఏఆర్‌ పోలీసుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించి రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌, జాతిపిత మహా త్మాగాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పిం చారు. విధి నిర్వహణలో నీతి నిజాయితీగా ఉంటూ పోలీస్‌శాఖ సేవలను ప్రజలకు అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.యం శుభవల్లి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ డా.మల్లికార్జున్‌, పేట పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ శ్రీకాంత్‌రెడ్డి, పీఎస్‌లో ఎస్‌ఐ సురేష్‌గౌడ్‌, ఎక్సైజ్‌ కార్యాలయంలో సీఐ నాగేందర్‌, అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి నారాయణ్‌రావు, జిల్లా రవాణా కార్యాలయంలో ఆర్టీవో వీరస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.



Updated Date - 2022-01-27T05:18:25+05:30 IST