ముగిసిన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌

ABN , First Publish Date - 2021-12-06T04:37:56+05:30 IST

పట్టణంలోని సోమనాద్రి మినీ స్టేడియం లో గద్వాల ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌, ప్రవీణ్‌సేవా సమితి, ఫుట్‌బాల్‌ టీం 93బ్యాచ్‌ ఆధ్యర్యంలో నిర్వహించిన రెండు రోజుల ఇన్విటేషన్‌ టోర్నమెంట్‌ ఆదివారం రాత్రి ముగిసింది.

ముగిసిన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌
విజేత క్రీడాకారులకు నగదు, ట్రోఫీని అందజేస్తున్న నిర్వాహకులు

- విజేతగా నిలిచిన  గద్వాల ఎల్లో జట్టు

గద్వాల అర్బన్‌, డిసెంబరు 5 : పట్టణంలోని సోమనాద్రి మినీ స్టేడియం  లో గద్వాల ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌, ప్రవీణ్‌సేవా సమితి, ఫుట్‌బాల్‌ టీం 93బ్యాచ్‌ ఆధ్యర్యంలో నిర్వహించిన రెండు రోజుల ఇన్విటేషన్‌ టోర్నమెంట్‌ ఆదివారం రాత్రి ముగిసింది. మొత్తం 14 జట్లు హాజరుకాగా, ఫైనల్‌లో ఎమ్మిగనూరు, గద్వాల ఎల్లో టీం జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన పోటీలో గద్వాల ఎల్లో టీం... మూడు గోల్స్‌ సాధించగా, ఎమ్మిగనూరు జట్టు 1గోల్‌కే పరిమితమైంది. దీంతో విన్నర్‌గా గద్వాల ఎల్లో జట్టు, రన్నర్‌గా ఎమ్మిగనూరు జట్లు నిలిచాయి. ముగింపు కార్యక్రమంలో విన్నర్‌ జట్టుకు ఎర్రవల్లి సరస్వతి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ యాజమాన్యం రూ.20వేలు, జ్ఞాపికను అందజేయగా, రన్నర్‌గా నిలిచిన ఎమ్మి గనూరు జట్టుకు ఫుట్‌బాల్‌ 93బ్యాచ్‌ ఆధ్వర్యంలో రూ.10వేల నగదు, జ్ఞాపికను అందజేశారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ బాలరాజు గౌడ్‌ హాజరై మాట్లాడుతూ గెలుపుఓటములను సమాన స్ఫూర్తితో తీ సుకునే ఆత్మస్థైర్యం క్రీడాకారులకు మాత్రమే సాధ్యమన్నారు.  క్రీడాకారులు క్రమం తప్పకుండా వ్యాయమంతోపాటు తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించేందుకు ని త్యసాధన అవసరమన్నారు. కార్యక్రమంలో జీఎఫ్‌ఏ అధ్యక్షుడు బండల వెంకట్రా ములు, సెక్రటరీ విజయ్‌కుమార్‌, కౌన్సిలర్‌ బండల పాండు, సీనియర్‌ క్రీడాకారులు బండల సాయిబాబ, ఎస్‌వి రమణ, ఆనంద్‌, వెంకటస్వామి, పులి విజయ్‌కుమార్‌, మల్లన్న, ప్రదీప్‌, హలీం, జాడే శ్రీను, సుజన్‌, అనీల్‌, ఈనాడు రాము, వినాయక్‌ ఉన్నారు. 

Updated Date - 2021-12-06T04:37:56+05:30 IST