కరోనా సమయంలో ప్రైవేట్‌ టీచర్లకు ప్రభుత్వం అండ

ABN , First Publish Date - 2021-04-10T06:43:57+05:30 IST

దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రైవేట్‌స్కూల్‌ టీచర్లకు, సిబ్బందికి కరోనా సమయంలో నెలకు రెండువేల రూపాయలు, 25 కిలోల సన్నబియ్యం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

కరోనా సమయంలో ప్రైవేట్‌ టీచర్లకు ప్రభుత్వం అండ
మంత్రిలో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు

నెలకు రెండు వేలు, 25 కిలోల బియ్యం పంపిణీ

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

నిర్మల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 9 : దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రైవేట్‌స్కూల్‌ టీచర్లకు, సిబ్బందికి కరోనా సమయంలో నెలకు రెండువేల రూపాయలు, 25 కిలోల సన్నబియ్యం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి గంగుల కమలాకర్‌ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్లకు, సిబ్బందికి నెలకుడబ్బు, బియ్యం పంపిణీ ఏర్పాట్ల కార్యాచరణ ప్రణాళికపై అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాసంక్షోభం అన్ని రంగాలను కుదిపేసిందని, రాష్ట్రంలో విద్యాలయాలు మూసే ఉన్నాయని, ఈ విపత్కర పరిస్థితుల నుండి ప్రైవేట్‌ సూళ్ల టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసుతో దేశంలో ఎక్కడా లేని విధంగా  ఈ పథకాన్ని నిర్ణయించి, మానవతకు మారుపేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలిచారన్నారు. ఏప్రిల్‌ నుంచి ఈ సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో టీచర్లు, సిబ్బంది కోసం ప్రతీ నెల రూ.13 కోట్ల 57 లక్షల వ్యయంతో బియ్యంపంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 1 లక్ష 45 వేల మంది ప్రైవేట్‌స్కూళ్లలో ఉన్న టీచర్లను, సిబ్బందిని ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహృ దయంతో ప్రైవేట్‌స్కూళ్ల ఉపాధ్యాయుల సిబ్బంది ఇబ్బందులను తొలగించేందుకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రెండువేల రూపాయల ఆర్థికసహాయం, ప్రైవేట్‌స్కూళ్ల టీచర్లకు, సిబ్బందికి అందించేదుకు వివరాలు సేకరించాలని అన్నారు. ఏప్రిల్‌ 12 నుండి 15 వరకు ప్రైవేట్‌స్కూళ్ల సిబ్బంది వివరాలను సేకరించి ఏప్రిల్‌ 16న పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు సూచించారు. ఏప్రిల్‌ 17 నుండి 19 వరకు రాష్ట్రస్థాయి ప్రైవేట్‌స్కూళ్ల టీచర్ల, సిబ్బంది వివరాలను పరిశీలిస్తారని, ఏప్రిల్‌ 21 నుండి 25 మధ్య నగదు, బియ్యం పంపిణీకి సంబంధించి తాత్కాలిక షెడ్యూల్‌ నిర్ణయిస్తామని తెలిపారు. అర్హత గల అభ్యర్థుల బ్యాంకు అకౌంట్‌నెంబర్‌, ఆధార్‌ కార్డునెంబర్‌ మొదలగు పూర్తి వివరాలు మండల విద్యాధికారుల ద్వారా సేక రించాలని తెలిపారు. జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ మాట్లాడుతూ జిల్లాలో 207 గుర్తింపు పొందిన పాఠశాలలు ఉన్నాయని, అందులో 2800 మంది ఉపాధ్యాయులు, 150 మంది నాన్‌ టీచింగ్‌స్టాప్‌ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించా మని తెలిపారు. డివిజనల్‌, మండల టీమ్‌లను ఏర్పాటు చేసి ప్రైవేట్‌ పాఠశాల లో పనిచేస్తున్న సిబ్బంది ఖచ్చితమైన వివరాలు సేకరించి ప్రభుత్వం ప్రకటించిన విధంగా నెలకు నగదు, బియ్యం అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అద నపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, డాక్టర్‌.రాంబాబు, జిల్లా విద్యాధికారి ప్రణీత, జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-10T06:43:57+05:30 IST