Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వం అండగా ఉంటుంది.. ధైర్యంగా ఉండండి

ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, మేయర్‌ సురే్‌షబాబు

సీకేదిన్నె /కడప(ఎర్రముక్కపల్లి) నవంబరు 28: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల నుంచి తేరుకోక ముందే మళ్లీ వర్షాలు కురుస్తున్నందున నగరవాసులు ఎలాంటి భయాందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా, నగర మేయర్‌ సురే్‌షబాబులు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆదివారం ఊటుకూరు చెరువును మేయర్‌ సురే్‌షబాబుతో కలిసి అంజద్‌బాషా పరిశీలించారు. వారు మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల ఇప్పటికే జిల్లాలోని చెరువులన్నీ నిండుకుండలా మారాయని, ఈ నేపథ్యంలో ఈ చెరువును పరిశీలించామని తెలిపారు. జిల్లాలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపఽథ్యంలో ఇరిగేషన్‌ అధికారులు జిల్లాలోని నీటి ప్రాజెక్టు, చెరువులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని గండి, మైలవరం, పాపాఘ్ని, కుందూ నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపఽథ్యంలో యువత వాటి పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా తల్లిదండ్రులు నియంత్రించాలన్నారు. ఈ పర్యటనలో ఇరిగేషన్‌ ఏఈ జగదీశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, ఇరిగేషన్‌ అధికారులు, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement