Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రొద్దుటూరు అర్బన్‌ నవంబరు 30: తుఫాను దాడితో పంటలన్నీ ధ్వంసమై రైతు గోడుగోడు మంటున్నాడని ఈ సమయంలో ప్రభుత్వం రైతును అన్ని విధాల ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వరదరా జులరెడ్డి డిమాండ్‌చేశారు. మంగ ళవారం ఆయన విలేకరుతో మా ట్లాడుతూ రాయలసీమ రైతును ఎప్పుడూ కరువుకాటేస్తే మూడే ళ్లుగా వరదలు తీవ్రం గా దెబ్బతీస్తున్నాయన్నారు. కోతకు వచ్యిన వరిపంటతో సహా మెట్ట రైతులు వేసిన శనగ, కంది, పత్తి మినుము పంటలు పూర్తి గా తుడిచిపెట్టకపోయాయన్నారు. ప్రభుత్వం పంటలకు పూర్తి నష్టపరిహారం చెల్లించి తిరిగి పంటలకు విత్త నాలు ఎరువులు ఉచితంగా అందజేయాలన్నారు. పంట రుణాలు మాపీ చేస్తూ కొత్తరుణాలు మంజూరు చేయాలన్నారు. రాజంపేట మండలంలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి కొట్లుకుపోయిన గ్రామాల ప్రజ లకు యుద్ధప్రాతిపదికన పునరావాసం కల్పించాలన్నారు. సమా వేశంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, శివాల యం మాజీ చైర్మన్‌ పల్లా శంకర్‌, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు గుర్రప్పలు పాల్గొన్నారు

Advertisement
Advertisement