Advertisement
Advertisement
Abn logo
Advertisement

అభివృద్ధిని అటకెక్కించిన ప్రభుత్వం

టీడీపీ నేతలు లింగారెడ్డి, భూపే్‌షరెడ్డి ధ్వజం


పెద్దముడియం, డిసెంబరు 7: వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని అటకెక్కించిందని, పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటూ కోతలతో ప్రజలకు వాతలు పెడుతున్నారని కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జి భూపే్‌షరెడ్డిలు విమర్శించారు. మండల పరిధిలోని కొండసుంకేసులలో మంగళవారం సాయంత్రం గౌరవసభ జరిగింది. లింగారెడ్డి, భూపే్‌షరెడ్డిలు మాట్లాడుతూ ఒక్కచాన్స్‌ ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడన్నారు. 80 శాతం సబ్సిడీతో ఇచ్చే విత్తనాలను కొంతమందికే అరకొరగా పంపిణీ చేస్తున్నారని, ఏటీఎస్‌ పేరు చెప్పి ఇంటికి రూ.10 వేలు కడితేనే పింఛన్‌, అమ్మఒడి పథకాలు వర్తిస్తాయని లేకుంటే తొలగిస్తామని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వారిని బెదిరించడం, కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జగన్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ముఖ్యంగా యువతకు ఉద్యోగావకాశాలు రాకుండా మోసం చేసిందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు జంబాపురం రమణారెడి ్డ, శ్రీనివాసులు, మహేష్‌, దేవగుడి యూత్‌ నాగే్‌షరెడ్డి, గ్రామ నాయకులు వెంకటరామిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, భూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement