సోమార్‌పేట్‌లో గుడిసె దగ్ధం

ABN , First Publish Date - 2020-02-23T06:57:55+05:30 IST

మాచారెడ్డి మండలంలోని సోమార్‌పేట్‌ గ్రామంలో ప్రమాద వశాత్తు విద్యుత్‌ తీగలు త గిలి నివాసపు గుడిసెకు

సోమార్‌పేట్‌లో గుడిసె దగ్ధం

మాచారెడ్డి, ఫిబ్రవరి 22: మాచారెడ్డి మండలంలోని సోమార్‌పేట్‌ గ్రామంలో ప్రమాద వశాత్తు విద్యుత్‌ తీగలు తగిలి నివాసపు గుడిసెకు నిప్పుంటుకొని కాలిపోయింది. వివరా లు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన గుగులోత్‌ రవి నివాస పు గుడిసెకు సరఫరా చేసే విద్యుత్‌ తీగలు  ఒకదానికి ఒకటి తగిలి మంటలు లేచి గుడిసెకు నిప్పంటుకుంది. దీనిని గమ నించిన గ్రామస్తులు, చుట్టు ప్రక్కల వారు గుడిసె పైకప్పు తొ లిగించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ అగ్ని ప్రమా దంలో గుడిసెకు గల విలువైన టేకు కలప, 3 బస్తాల బి య్యం, 5 బస్తాల మొక్కజొన్నలు, దుస్తులు, గల్ప్‌దేశం వెళ్లడా నికి తెచ్చుకున్న లక్షాపదిహేనువేల నగదు, వంటసామాగ్రి తదితర వస్తువులు కాలిపోయాయి. ప్రభుత్వం స్పందించి భాదిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2020-02-23T06:57:55+05:30 IST