మా వదిన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ పక్కింటోళ్లకు కాల్ చేసి చెప్పాడా వ్యక్తి.. వాళ్లు వెళ్లి చూస్తే..
ABN , First Publish Date - 2022-04-26T19:17:34+05:30 IST
ఓ వ్యక్తి తన వదినకు ఫోన్ చేశాడు. అయితే ఆమె ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి విషయం...
అప్పటివరకు బాగున్న వారు.. ఉన్నట్టుండి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో చాలా మంది అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడడం కూడా చూస్తుంటాం. రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ వ్యక్తి తన వదినకు ఫోన్ చేశాడు. అయితే ఆమె ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. వారు వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్ రాష్ట్రం భరత్‌పూర్ పరిధి ఓడెల్ జాట్ గ్రామానికి చెందిన రింకు, ఇందు(27) దంపతులు. రింకూ కోచింగ్ సెంటర్ నడుపుతూ తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. ఇటీవల ఓ రోజు రింకూ కోచింగ్ సెంటర్‌కు వెళ్లి్న సమయంలో ఇందు ఒక్కటే ఇంట్లో ఉంది. ఆ సమయంలో రింకూ సోదరుడు తన వదినకు ఫోన్ చేశాడు. అయితే ఆమె ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి పక్కింటి వారికి ఫోన్ చేశాడు. ‘‘మా వదిన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.. ఒక్కసారి వెళ్లి చూడండి’’.. అని చెప్పాడు.
రోడ్డుపై నిలబడి లిఫ్ట్ అడిగిందో 32 ఏళ్ల మహిళ.. అటుగా వెళ్తూ కారులో ఎక్కించుకున్న డ్రైవర్.. చివరకు..
దీంతో పక్కింటి వారు వెళ్లి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో ఇందు భర్త రింకూకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. ఇంటికి చేరుకున్న రింకూ.. ఎన్నిసార్లు పిలిచినా ఇందు నుంచి స్పందన రాలేదు. దీంతో అంతా కలిసి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. లోపల ఇందు ఫ్యాన్‌కు వేళాడుతూ ఉండడం చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.