Leave Letter లో ఓ ఉద్యోగి చెప్పిన కారణానికి అవాక్కవుతున్న నెటిజన్లు.. ఇంత నిజాయితీ ఏంట్రా బాబూ అంటూ..
ABN , First Publish Date - 2022-06-16T21:42:56+05:30 IST
సెలవులు అవసరమైన సమయంలో కొందరు ఉద్యోగులు.. తమ బాస్‌కు వివిధ కారణాలు చెప్పి, ఎలాగోలా ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొందరు ఉద్యోగులు తమ సమస్యను నిజాయితీగా..
సెలవులు అవసరమైన సమయంలో కొందరు ఉద్యోగులు.. తమ బాస్‌కు వివిధ కారణాలు చెప్పి, ఎలాగోలా ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొందరు ఉద్యోగులు తమ సమస్యను నిజాయితీగా చెప్పి.. సెలవులు తీసకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉద్యోగి మాత్రం ఎంతో నిజాయితీగా తన బాస్‌కు లీవ్ అప్లికేషన్ పంపాడు. ఎంత నిజాయితీ అంటే, అతడు చెప్పిన కారణం తెలిస్తే.. వీడేంట్రా.. మరీ ఇంత నిజాయితీగా ఉన్నాడు అని మీరే అంటారు.
సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఓ ఉద్యోగి తన బాస్‌కు లీవ్ కావాలంటూ మెయిల్ చేశాడు. ఆ మెయిల్‌ను చూసిన బాస్.. ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇంతకీ అందులో ఏముందంటే...‘‘ డియర్ సార్.. గుడ్ మార్నింగ్.. నాకు వేరే కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. అందుకే దయచేసి నాకు ఈ రోజు సెలవు మంజూరు చేయండి’’.. అని పేర్కొన్నాడు. ఈ సందేశం చూసిన బాస్.. ఉద్యోగి నిజాయితీని మెచ్చుకుంటూ, ఇ-మెయిల్‌ను స్క్రీన్ షాట్ తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు.
Currency నోట్లను తయారు చేయడానికి దేన్ని ఉపయోగిస్తారో తెలుసా..? పేపర్ అస్సలు కాదండోయ్..!
తన జూనియర్లు చాలా మంచి వారని, అందుకే వేరే సంస్థలో ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యేందుకు సెలవు కావాలంటూ నిజాయితీగా చెప్పారు.. అంటూ తన ఉద్యోగిని ప్రశంసించాడు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. నిజాయితీ, అమాయకత్వంతో కూడిన వ్యక్తిలా ఉన్నారని ఒకరు అంటే.. ఇలాంటి నిజాయితీపరులు ఉంటే సంస్థలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.. అంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.