రుణ ప్రణాళిక లక్ష్యం పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-06-24T05:07:46+05:30 IST

ఆర్థిక సంవత్సరం 2021- 22గాను రుణప్రణాళిక లక్ష్యాలను సంబంధితశాఖల అధికారుల సమన్వయంతో పూర్తిస్థాయిలో సాధించా లని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

రుణ ప్రణాళిక లక్ష్యం పూర్తి చేయాలి
ఆర్థిక ప్రణాళిక బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, జూన్‌ 23: ఆర్థిక సంవత్సరం 2021- 22గాను రుణప్రణాళిక లక్ష్యాలను సంబంధితశాఖల అధికారుల సమన్వయంతో పూర్తిస్థాయిలో సాధించా లని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి 2,218.59కోట్లరూపాయల రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈసందర్భంగా కలె క్టర్‌ మాట్లాడుతూ ఇందులో రూ.1318.87కోట్లు పంట రుణాలు, రూ.507.73కోట్లు వ్యవసాయ ఆధారిత దీర్ఘకాలిక రుణాలు, రూ.164.40కోట్లు పారిశ్రామిక వర్గాలకు కేటాయించామని, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.107.29కోట్లు, అప్రాధా న్యతరంగాలకు రూ.120.30కోట్లు కేటాయిం చామన్నారు. గతసంవత్సరం కంటే 36.28 శాతం అధికంగా కేటాయించామన్నారు. కేటాయించిన లక్ష్యాలను సంబంధిత బ్యాం కర్లు వానాకాలం సీజన్‌లో పూర్తి చేసుకో వాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన 1000మహిళా గ్రూపులకు సంబం ధించిన రుణాలు అర్హతమేరకు మంజూరు చేయా లని బ్యాంకర్లను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ రైతుబంధు డబ్బులకు సంబంధించి రైతులకు ఇవ్వడంలో ఎలాంటిజాప్యం చేయవద్ద న్నారు. అర్హులైన రైతులకు నూతనంగా పంటరు ణాలు మంజూరు చేయాలని, దీర్ఘకాలిక రుణాలు సకాలంలో అందించి వ్యవసాయాధికారుల సహకా రంతో లక్ష్యాలను చేరుకోవాలన్నారు. సమావేశంలో నాబార్డు డీడీఎంరాజశేఖర్‌, ఎస్‌బీఐఆర్‌ఎం అరవింద్‌ కుమార్‌, లీడ్‌బ్యాంకు మేనేజర్‌ ఎం చెంచురామయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవికృష్ణ, కేజీబీ ఆర్‌ఎం, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..: కలెక్టర్‌

సిర్పూర్‌(టి), జూన్‌ 23: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం మండలంలోని మారు మూల ఇటిక్యాల పహాడ్‌ గ్రామాన్ని సందర్శిం చారు. గ్రామంలో ఇప్పటి వరకు ఎందుకు శ్మశాన వాటిక, డంపింగ్‌ యార్డు పనులను చేపట్టలేదని ఎంపీడీవో రాజేశ్వర్‌ను ప్రశ్నించారు. అనంతరం గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను సర్పంచ్‌ గోపిచంద్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే తమ భూములు రిజర్వు ఫారెస్టులోకి వస్తున్నాయని అటవీ శాఖాధికారులు తెలుపు తున్నారని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడ జీవిస్తున్నామని తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు కలె క్టర్‌కు విన్నవించుకున్నారు. ఎఫ్‌ఆర్వో పూర్ణచం దర్‌, ఎంపీడీవో, తహసీల్దార్‌, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌, ఎస్సై రవికుమార్‌ ఉన్నారు. 

Updated Date - 2021-06-24T05:07:46+05:30 IST