12 ఏళ్ల కూతురు 8 నెలల గర్భవతి అని తెలిసి నివ్వెరపోయిన తల్లిదండ్రులు.. ఏడుస్తూ ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2021-07-12T22:41:31+05:30 IST

కడుపు నొప్పిగా ఉందని 12 ఏళ్ల కూతురు చెప్పడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

12 ఏళ్ల కూతురు 8 నెలల గర్భవతి అని తెలిసి నివ్వెరపోయిన తల్లిదండ్రులు.. ఏడుస్తూ ఆమె చెప్పింది విని..

కడుపు నొప్పిగా ఉందని 12 ఏళ్ల కూతురు చెప్పడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.. అక్కడ అన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆమె 8 నెలల గర్భవతి అని చెప్పారు.. షాకైన తల్లిదండ్రులు ఆ బాలికను ఆరా తీయగా ఆమె అసలు విషయం చెప్పింది.. పెదనాన్న 9 నెలల క్రితం తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది.. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరిగింది.


కోయంబత్తూరులోని ఓ కాలనీలో ఓ వ్యక్తి తన భార్య, కూతురితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆ ఇంటి పైన తన 43 ఏళ్ల అన్నయ్య ఫ్యామిలీ ఉంటుంది. తొమ్మిది నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పైనుంచి వచ్చిన వ్యక్తి తన తమ్ముడి కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక తన పెదనాన్న చేసిన అత్యాచారం గురించి ఎవరికీ చెప్పలేదు. 


ఇటీవల ఆ బాలిక కడుపునొప్పితో విలవిలలాడింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది. దీంతో వారు సెంట్రల్ ఆల్ వుమెన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పోస్కో చట్టం కింద గత శనివారం అరెస్ట్ చేశారు.  


Updated Date - 2021-07-12T22:41:31+05:30 IST