మంత్రాల నెపంతోనే హత్యకు పాల్పడ్డారు

ABN , First Publish Date - 2021-07-23T05:55:18+05:30 IST

బావమరిది కుటుంబ సభ్యులు అనారోగ్యానికి కారణం గ్రామానికి చెందిన తొరె హన్మంతు చేసే మంత్రాలు కార ణమనే అపోహతోనే అతనిని హత్య చేశారని కౌటాల సీఐ బుద్ధేస్వామి తెలిపారు.

మంత్రాల నెపంతోనే హత్యకు పాల్పడ్డారు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ బుద్దే స్వామి

- సీఐ బుద్ధే స్వామి

కౌటాల, జూలై 22: బావమరిది కుటుంబ సభ్యులు అనారోగ్యానికి కారణం గ్రామానికి చెందిన తొరె హన్మంతు చేసే మంత్రాలు కార ణమనే అపోహతోనే అతనిని హత్య చేశారని కౌటాల సీఐ బుద్ధేస్వామి తెలిపారు. మండ లంలోని మొగడ్‌దగడ్‌ గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న హత్యకేసుకు సంబంధించి నిందితులను గురువారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈసందర్భంగా సీఐ స్వామివివరాలు వెల్లడించారు. మొగడ్‌దగడ్‌ గ్రామానికి చెందిన బోయిరె కాశీనాథ్‌, అతనితండ్రి గంగారాం, కుటుంబ సభ్యులు అనారోగ్యం బాగాలేదు. దీనికి కారణం గ్రామానికిచెందిన థోర్‌ హన్మం తు మంత్రాలు చేయడమేనని అనుకున్న కాశీనాథ్‌ విషయాన్ని తనబావ చౌదరి మారు తికి చెప్పాడు. దీంతో మారుతి, బావమరిది కాశీనాథ్‌ కలిసి హన్మంతును ఎలాగైన చంపాలని ప్లాన్‌చేశారు. ఈ క్రమంలో హన్మంతు రన్‌వెల్లిగ్రామం నుంచి కౌటాలకు వచ్చే క్రమంలో కాశీనాథ్‌తో కలిసి మారుతి మొగడ్‌దగడ్‌ గ్రామశివారులో చెరువువద్ద చెట్ల మధ్యకు హన్మంతుని లాక్కెళ్లి కర్రతో కొట్టి, గొంతు నులిమి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా తామేహత్య చేసినట్లు నిందితులు కాశీనాథ్‌, అతనిబావ మారుతి  ఒప్పుకు న్నారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించి నట్లు తెలిపారు.

Updated Date - 2021-07-23T05:55:18+05:30 IST