Abn logo
Aug 4 2020 @ 05:18AM

కోరలు చాస్తున్న.. కరోనా

జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు 

ఇప్పటికే వెయ్యి దాటిన బాధితుల సంఖ్య

కామారెడ్డి, బాన్సువాడలలో పరిస్థితి మరీ దారుణం 

ఆయా పట్టణాల్లో ఇప్పటివరకు ఐదుగురి మృతి

5నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు అఖిలపక్షం పిలుపు 

నిర్లక్ష్యం వీడకుంటే.. తప్పదు పెనుముప్పు! 


కామారెడ్డి, ఆగస్టు 3: జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. గతంలో రోజుకు పదుల సంఖ్యలో కేసులు రాగా.. గత 15 రోజుల నుంచి వందల్లో కేసులు వస్తున్నాయి. రోజురోజుకూ కేసులు పెరిగి పోతుండడంతో పరిస్థితి ఆందోళ నకరంగా మారుతోంది. ఇప్పటివరకు జిల్లాలోని ఆయా మండలాల్లో శాంపి ళ్లు, ర్యాపిడ్‌ టెస్ట్‌ల ద్వారా వెయ్యి కేసులకు పైనే నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసులతో పాటు జిల్లాలో మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో కేసుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలలో వాణిజ్య, వ్యాపార కేంద్రాలు అధి కంగా ఉండడంతో.. చుట్టుపక్కల మండల కేంద్రాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు ఎక్కువగా వస్తుపోతూ ఉండడంతో.. కరోనా మ హమ్మారి ఒక చోట నుంచి మరోచోటకు ఉగ్రరూపం దాలుస్తోంది. 

 

అత్యధిక కేసులతో ఆందోళన 

జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డిలోని చాలా వార్డులలో కరోనావైరస్‌ విలయ తాండవం చేస్తోంది. ముఖ్యంగా పట్టణం లోని విద్యానగర్‌, కాకతీయనగర్‌, అశోక్‌నగర్‌, ఎన్‌జీవోస్‌ కాలనీ, శ్రీరాం నగర్‌కాలనీ, వివేకానందకాలనీ, ఇస్లాంపూర, గోదాంరోడ్డు, పెద్దబజార్‌ తది తర కాలనీలలో కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో కేసు లతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. జిల్లాలో ఇప్ప టివరకు ఐదు మరణాలు సంభవించగా.. ఒక్క కామారెడ్డి పట్టణపరిధిలోనే మూడు మరణాలు, బాన్సువాడలో రెండు మరణాలు ఉన్నాయంటే.. ఆ యా ప్రాంతాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అనధికార మరణాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. దీంతో పట్టణాలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

 

స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు పిలుపు 

 కామారెడ్డి, బాన్సువాడ పట్టణాలలో రోజురోజుకూ కరోనా విరుచుకు పడుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో 12 కేసులకే పరిమితమైన రెండు పట్ట ణాల్లో.. ప్రస్తుతం వందల సంఖ్యల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల వ్యాపారులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు సిద్ధమయ్యా రు. గత నెల రోజుల క్రితం కామారెడ్డిలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యం లో ఐదురోజుల పాటు బంద్‌ నిర్వహించారు. అనంతరం ఆరుగంటల వరకే వ్యాపార సముదాయాలను మూసివేయాలని నిర్ణీత సమయాన్ని ప్రకటిం చారు. అయితే ఇప్పుడు మరిన్ని కేసులు పెరుగుతున్నందు దృష్ట్యా.. కొన్ని రోజుల పాటు వ్యాపారాలను బంద్‌ చేసుకుంటేనే మంచిదనే ఆలోచనలో ఆయా వర్గాల వారు ఉన్నారు. ఇందులో భాగంగానే సోమవారం కామారెడ్డి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో అఖిలపక్షనాయకులు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు సమావేశమై ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించాలని ప్రజలకు, వ్యాపార, వాణిజ్య సంఘలకు పిలుపునిచ్చారు. దోమకొండలో అఖిలపక్ష నాయకులు సైతం 5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయించారు. ఇక బాన్సువాడ పట్టణంలో సైతం ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు స్వచ్చందలాక్‌డౌన్‌కు నిర్ణయం తీసుకున్నారు. కేవలం కూరగాయలు, పాలు, మెడికల్‌ షాపులకు మాత్రమే సడలింపులు ఇచ్చారు.


నిర్లక్ష్యం వీడాల్సిందే..!

జిల్లాలో వైరస్‌ కట్టడికి వైద్యసిబ్బంది, అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. పలు గ్రామాల్లోనూ స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తూ వైరస్‌ కట్టడికి పంచాయతీ పాలక వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. వ్యాపార సంస్థలు సైతం భౌతికదూరం పాటించేలా, చేతులు శానిటైజ్‌ చేసుకునేలా చూస్తు న్నాయి. అయినా మెజార్టీ ప్రజలు.. ముఖ్యంగా యువత మాత్రం ఇంకా నిర్లక్ష్యం వీడడం లేదు. అవసరం లేకున్నా బయటకు వెళ్త్లున్నారు. మాస్క్‌ లు సైతం ధరించడం లేదు. వాణిజ్య సముదాయాల వద్ద ఎంత చెప్పినా.. భౌతిక దూరం విస్మరిస్తున్నారు. మార్కెట్‌లో గుంపులుగుంపులుగా తిరుగుతూ వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారు. 


స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు సహకరించాలి : కైలాస్‌ శ్రీనివాస్‌రావు (డీసీసీ అధ్యక్షుడు ) 

అఖిలపక్షం, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో పదిరోజుల పాటు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిర్వ హించేందుకు నిర్ణయించాం. ప్రజలందరూ సహకరించాలి. కరో నా వైరస్‌ నియంత్రణలో భాగంగా తీసుకున్న నిర్ణయం కనుక వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులూ స్వచ్ఛందంగా బంద్‌ పాటించాలి. పట్టణంలోని ఆయా పార్టీల కార్యకర్తలు సైతం  భౌతికదూరం, మాస్క్‌లు ధరించేలా ప్రజలకు తప్పకుండా అవగాహన కలిగించాలి. 

Advertisement
Advertisement