జిల్లాలో టీబీ రోగుల సంఖ్య తగ్గింది

ABN , First Publish Date - 2020-02-28T11:05:37+05:30 IST

జిల్లాలో టీబీ రోగుల సంఖ్య పూర్తిగా తగ్గిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో ఐఎంఏ వైద్యులకు సదస్సును

జిల్లాలో టీబీ రోగుల సంఖ్య తగ్గింది

పెద్దబజార్‌, ఫిబ్రవరి 27: జిల్లాలో టీబీ రోగుల సంఖ్య  పూర్తిగా తగ్గిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో ఐఎంఏ వైద్యులకు సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ  టీబీ రోగుల వివరాలు సేకరిం చి వారికి వైద్యం చేసి డీఎంహెచ్‌వో కార్యాలయా నికి పంపించి సహకరిస్తున్నారని ఆరోగ్య శిబిరా లు, ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించడ ం అభినందనీయమని అన్నారు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు 2025 సంవత్సరం వరకు టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఐఎంఏ వైద్యులు ముందుకు వచ్చి టీబీ రోగులకు వైద్యం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో టీబీ రోగుల సంఖ్య తగ్గిపోయిం దన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో టీబీ వైద్యంపై ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ టి.వి.ఉదయ్‌కుమార్‌, చేతి వైద్య నిపుణులచే ఐఎ ంఏ వైద్యులకు సదస్సును నిర్వహించారు. కార్య క్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ జీవన్‌, కార్య దర్శి డాక్టర్‌విశాల్‌, మెడికల్‌ కౌన్సిల్‌ చైౖర్మన్‌ డాక్టర్‌ రవీంద్రరెడ్డి, 55 మంది వైద్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-02-28T11:05:37+05:30 IST