Advertisement
Advertisement
Abn logo
Advertisement

King Cobraను మెడలో వేసుకుని.. ఒక ఆట ఆడుకున్నాడు.. అయితే చివర్లో అలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు..!

విషపూరితమైన సర్పాల్లో కింగ్ కోబ్రా ఒకటి. ఇది కాటు వేసిందంటే అంతే. అందుకే ఇలాంటి పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ ఓ పెద్దాయన ఏకంగా దాన్ని మెడలో వేసుకుని నాట్యం చేశాడు. ఈయన్ను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే.. 


అస్సాంలోని కచార్ జిల్లా బిష్ణుపూర్ గ్రామ సమీపంలోని పొలాల్లో 14 అడుగుల కింగ్ కోబ్రా కనిపించింది. దీంతో స్థానికులు భయపడి.. పాములు పట్టే రఘునందన్ భూమిజ్(60) అనే వ్యక్తికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆయన.. దాన్ని పట్టుకుని మెడలో వేసుకుని ఊర్లోకి వచ్చాడు. స్థానికులకు భయం పోగొట్టాలనే ఉద్దేశంతో అందరికీ చూపిస్తూ.. నాట్యం చేశాడు. యువకులంతా వారి సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు. ఇంతలో అనుకోని ఘటన జరిగింది.

పామును మెడలో వేసుకున్న క్రమంలో ఆదమరచడంతో కోబ్రా ఒక్కసారిగా అతడిని కాటు వేసింది. దీంతో ఉన్నట్టుండి అతడు కిందపడిపోయాడు. ఊహించని పరిణామానికి షాక్ అయిన గ్రామస్తులు.. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రఘునందన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాములు పట్టడమే వృత్తిగా పెట్టుకున్న అతడు.. ఇలా కోబ్రా కారణంగా చనిపోవడం.. స్థానికలను కలచివేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement