సూపర్‌ స్టార్‌ కృష్ణకు మూడు ప్రపంచ రికార్డుల్లో స్థానం

ABN , First Publish Date - 2021-06-01T12:23:17+05:30 IST

ప్రముఖ సినీనటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ సినీరంగానికి చేసిన సేవలను గుర్తించి

సూపర్‌ స్టార్‌ కృష్ణకు మూడు ప్రపంచ రికార్డుల్లో స్థానం

హైదరాబాద్/బర్కత్‌పుర : ప్రముఖ సినీనటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ సినీరంగానికి చేసిన సేవలను గుర్తించి మూడు వరల్డ్‌ రికార్డులలో స్థానం కల్పించినట్లు ఆయా ప్రపంచ రికార్డుల సంస్థల ప్రతినిధులు లయన్‌ కేవీ రమణరావు,  తెలంగాణ ప్రతినిధి లలితారావు, దక్షిణ భారత ప్రతినిధి రవి తెలిపారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా సోమవారం ఆయన నివాసంలో  ప్రముఖ శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సమక్షంలో మూడు ప్రపంచ రికార్డుల ధృవ పత్రాలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫిల్మ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, ఆస్కార్‌ బుక్‌ఆఫ్‌ వరల్డ్స్‌, నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లలో స్థానం కల్పించిననట్లు వారు తెలిపారు.  


350 చిత్రాలలో నటించి పద్మభూషణ్‌, ఫిలింఫేర్‌, నేషనల్‌ ఫిలింపేర్‌ అవార్డులను సాధించారన్నారు.  17 చిత్రాలకుదర్శకత్వం వహించారని, సతీమణి విజయనిర్మలతో 48 చిత్రాలలో నటించారన్నారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారని ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి పలికారని వారు పేర్కొన్నారు. ఆదుర్తి సుబ్బారావు, వి మధుసూదనరావు, కె.విశ్వనాథ్‌, బాపు, దాసరినారాయణరావు చిత్రదర్శకులతో కలిసి పనిచేశారని వారు చెప్పారు.

Updated Date - 2021-06-01T12:23:17+05:30 IST