తెరుచుకున్న బాబ్లీ

ABN , First Publish Date - 2020-07-02T11:18:46+05:30 IST

మహారాష్ట్రలోని గోదావరిపై ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు బుధవారం తెరిచారు.

తెరుచుకున్న బాబ్లీ

గేట్లను ఎత్తిన అధికారులు

ఎస్సారెస్పీలోకి నీటి విడుదల

అక్టోబరు 28 వరకు తెరిచి ఉండనున్న గేట్లు 

ఎస్సారెస్పీ నుంచి ప్రస్తుతం నారుమళ్లకే  నీరు

సాగునీటిని విడుదల చేయాలని శివం కమిటీలో నిర్ణయం


నిజామాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహారాష్ట్రలోని గోదావరిపై ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు బుధవారం తెరిచారు. ప్రాజెక్టులోని నీటిని గోదావరిలోకి వదిలారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతీ సంవత్సరం జూలై ఒకటో తేదీన ఈ ప్రాజెక్టు గేట్లను తెరిచి అక్టోబరు 28న మూసివేస్తున్నారు. ప్రతీ సంవత్సరం వానాకాలం గోదావరికి వరద వచ్చే సమయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ గేట్లను ఎత్తి నాలుగు నెలల పాటు తెరిచే ఉంచుతారు. ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో వర్షాలు పడిన రీతిలో అక్కడి ప్రాజెక్టు లు నిండిన తర్వాత గోదావరికి వరదలు వస్తాయి. ఆ వరద నీటి ఆధారంగానే ఎస్సారెస్పీ ప్రతి యేడా ది నిండుతుంది. బచావత్‌ ట్రిబ్యూనల్‌  ఒప్పందం లేకుండానే బాబ్లీ ప్రాజెక్టును నిర్మించడంతో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా బుధవారం గేట్లను ఎత్తారు. ఎస్సా రెస్పీ  ఈఈ రామారావు, కేంద్ర వనరుల జలసంఘం ఈఈ మోహన్‌రావు, మహారాష్ట్రకు చెందిన నాందేడ్‌ ఈఈ వనాడే పాల్గొన్నారు. ఈ ముగ్గురి ఆధ్వర్యంలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచారు. ప్రాజెక్టులో ఉన్న 0.67 టీఎంసీల నీటిని గోదావరిలో వదిలారు. గేట్లను తెరిచేందుకు ఏపీకి చెందిన ధవళేశ్వరం ఈఈ హాజరుకావలసి ఉన్నా కోవిడ్‌ కారణం గా ఆయన హాజరుకాలేదు.


బాబ్లీ గేట్లను ఎత్తివేయడంతో కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నీటి మ ట్టాలు పెరిగాయి. వర్షాలు  లేకున్నా బాబ్లీలో ఉన్న నీటిని విడిచిపెట్టడం వల్ల గోదావరి పరుచుకొని నీ ళ్లు వెళుతున్నాయి. రెండు రోజుల పాటు ఈ నీటి ప్రవాహం కందకుర్తి, బాసర వద్ద ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీలో ప్ర స్తుతం 1091 అడుగులకు గాను 1070.04 అడుగుల నీళ్లున్నాయి. ప్రాజెక్టులో 90 టీఎంసీలకు గాను 29. 722 టీఎంసీల నీళ్లున్నాయి.  సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం బాబ్లీ గేట్లను ఎత్తినట్లు ఎస్సారెస్పీ ఈఈ రామారావు తెలిపారు. నాలుగు నెలల పాటు ఈ గే ట్లు తెరిచే ఉంటాయని అన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు లో నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్‌ వాటర్‌ కూ డా దాదాపుబాబ్లీ గేట్లవరకు ఉందని ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు అర టీఎంసీ కన్నా ఎక్కువ నీళ్లు ప్రాజెక్టులో చేరే అవకాశం ఉందని ఈ ఈ తెలిపారు. ఎస్సారెస్పీ  ఎగువన జైక్వాడ్‌ మినహా అన్ని చిన్న ప్రాజెక్టులే ఉండడం వల్ల వర్షాలు పడితే ఎస్సారెస్పీ లోకి వరద వస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఉత్తుర్వుల ప్రకారం బుధవారం ఈ గేట్లను తెరిచినట్లు ఆయన తెలిపారు.


నారుమళ్లకు నీళ్లివ్వాలని శివం కమిటీలో నిర్ణయం

ఎస్సారెస్పీ పరిధిలోని ఎల్‌ఎండీకి ఎగువన ఉన్న ఆయకట్టు ప్రస్తుతం నారుమళ్లకే నీటిని విడుదల చేయాలని హైదరాబాద్‌లో బుధవారం జరిగిన శి వం కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేధించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలకు చెందిన మంత్రులు ప్ర శాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ నిర్ణయం తీసుకున్న త ర్వాత వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ నీటిని వి డుదల చేయనున్నారు. ప్రస్తుతం నారుమళ్లే ఎల్‌ ఎండీ ఎగువన సిద్ధం చేస్తున్నందున నీటిని విడుద ల చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని వారు భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నీటిని విడుదల చేసి నా నాట్లేసే పరిస్థితి లేకపోవడం వల్ల నీళ్లు వృథా అవుతాయని నారుమళ్లకు ప్రస్తుతం విడుదల చేసి 20 రోజుల తర్వాత నాట్లకు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


శివం కమిటీ స మావేశంలో ఎస్సారెస్పీ సీఈతో పాటు ఈఎస్‌సీలు, సాగునీటి శాఖాధికారులు పాల్గొన్నారు. మంత్రుల నిర్ణయానికి అనుగుణంగా నారుమళ్లకు నీటి విడుదల చేస్తామని ఎస్సారెస్పీ సీఈ శంకర్‌ తెలిపారు. ప్రస్తుతం నారుమళ్లకు ఇచ్చి 20 రోజుల తర్వాత నాట్లకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇద్దరు మంత్రుల నిర్ణయానికి అనుగుణంగానే ఈ నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఎల్‌ఎండీ కింద మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈనెల లో వచ్చే వరద  అనుగుణంగా ఎల్‌ఎండీ దిగువన నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. 

Updated Date - 2020-07-02T11:18:46+05:30 IST