పెళ్లివారికి షాకిచ్చిన.. ఫొటోగ్రాఫర్..

ABN , First Publish Date - 2021-10-01T00:07:19+05:30 IST

పెళ్లి అంటేనే బంధువుల పలకరింపులు, విందు భోజనాలతో సందడిగా ఉంటుంది. వివాహం అనేది జీవితంలో మరపులేని ఘట్టం కాబట్టి.. ఆ మధుర క్షణాలను కలకాలం పదిలంగా ఉంచుకోవాలనుకుంటారు. విందుభోజనాలు తదితర ఏర్పాట్లకు ఎంత ఖర్చు

పెళ్లివారికి షాకిచ్చిన.. ఫొటోగ్రాఫర్..

పెళ్లి అంటేనే బంధువుల పలకరింపులు, విందు భోజనాలతో సందడిగా ఉంటుంది. వివాహం అనేది జీవితంలో మరపులేని ఘట్టం కాబట్టి.. ఆ మధుర క్షణాలను కలకాలం పదిలంగా ఉంచుకోవాలనుకుంటారు. విందుభోజనాలు తదితర ఏర్పాట్లకు ఎంత ఖర్చు పెడతారో.. వివాహ తంతును మొత్తం చిత్రీకరించే ఫొటోగ్రాఫర్ల విషయంలోనూ ఖర్చుకు వెనకాడరు. పెళ్లి కార్యక్రమాన్ని.. మొత్తం తమ కెమెరాలో బంధించే వీడియో, ఫొటోగ్రాఫర్లకు ఎంతో డిమాండ్ ఉంటుంది. అయితే ఓ పెళ్లిలో తనకు భోజనం పెట్టలేదననే కారణంతో.. ఓ ఫొటోగ్రాఫర్ చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 


ఓ వరుడు తన పెళ్లి ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్‌తో 250 డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 వరకు ఫొటోలు తీసేలా మాట్లాడుకున్నారు. ఫొటోగ్రాఫర్ తన పని తను చేసుకుంటున్నాడు. అయితే సాయంత్రం 5గంటల సమయంలో భోజనాల సమయం వచ్చే సరికి అతడికి అవమానం జరిగింది. తననూ ఎవరూ భోజనానికి పిలవకపోవడంతో అవమానంగా భావించాడు. అప్పటికే ఆకలితో ఉన్న అతను వరుడి దగ్గరకు వెళ్లి.. తనకు భోజనానికి 20నిమిషాల విరామం అవసరమని చెప్పాడు. అందుకు వరుడు అంగీకరించలేదు.


ఓపిక నశించిన ఫొటోగ్రాఫర్.. అప్పటివరకూ తీసిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేసేశాడు. దీంతో ఖంగుతున్న పెళ్లిపెద్దలు.. ఫొటోగ్రాఫర్‌ను నిలదీశారు. ‘‘హోటల్లో పది నిముషాలు కూర్చుని, ఏది తిన్నా 250 డాలర్లు అవుతుందని.. అలాంటిది అంత పెద్ద వివాహం చేస్తూ.. తనకు కనీసం భోజనం పెట్టలేదని’’  ఫొటోగ్రాఫర్ వాపోయాడు. కనీసం చల్లటి నీరు కూడా ఇవ్వలేదని చెప్పకొచ్చాడు. దీంతో ఫొటోలను తొలగించినట్లు చెప్పాడు.


‘‘అసలు తను వృత్తి పరంగా ఫొటోగ్రాఫరే కాదని.. కుక్కలు పెంచడం తనకు అలావాటని, వాటిని ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటానని.. తన మిత్రుడు బిజీగా ఉండడంతో డబ్బు ఆదా చేయాలని తనను పంపించినట్లు’’.. తర్వాత అతడు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పలువురు నెటిజన్లు.. ఫొటోగ్రాఫర్‌కు మద్దతు ఇస్తుండగా, అలా ఫొటోలు డిలీట్ చేయకూడదని ఇంకొందరు సూచిస్తున్నారు.

Updated Date - 2021-10-01T00:07:19+05:30 IST