Viral Video: విమానం పైలెట్‌కు కనిపించిన షాకింగ్ దృశ్యం.. సముద్రంలో ఇదేం విచిత్రం.. ఏలియన్సేనా..?
ABN , First Publish Date - 2021-12-08T23:56:41+05:30 IST
విమాన పైలెట్ ఆకాశంలో ఉండగా.. సముద్రంపై ఆయనకు షాకింగ్ దృశ్యం కనిపించింది. వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ దృశ్యం చూసిన వారంతా.. ఇది ఏలియన్స్ పనే అని అంటున్నారు...
నేటి స్మార్ట్ ఫోన్ యుగంలో ఎక్కడ ఏ చిన్నపాటి వింతలు, విశేషాలు జరిగినా ఇట్టే మన చేతిలోకి వచ్చిపడుతుంటాయి. కొన్ని ఆశ్చర్యకర ఘటనలను తేలిగ్గా కొట్టిపారేసినా.. చూడటానికి మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి సిత్రాలు కూడా జరుగుతుంటాయా.. అన్నంత విస్మయానికి గురవుతూ ఉంటాం. కొన్ని వీడియోలు గ్రాఫిక్స్‌తో కూడుకున్నవి కాగా.. కొన్ని మాత్రం మన కల్లు కూడా నమ్మలేని విధంగా ఉంటాయి. అలాంటి ఓ వీడియో ఒకటి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమాన పైలెట్ ఆకాశంలో ఉండగా.. సముద్రంపై ఆయనకు షాకింగ్ దృశ్యం కనిపించింది. వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ దృశ్యం చూసిన వారంతా.. ఇది ఏలియన్స్ పనే అని అంటున్నారు...
ఓ పైలెట్ పసిఫిక్ మహాసముద్రం మీదుగా విమానంలో ప్రయాణిస్తున్నాడు. కొంత దూరం ప్రయాణించాక.. నాలుగు చుక్కలు ఒకదాని పక్కన ఒకటి ప్రయాణిస్తూ కనిపించాయి. ఆశ్చర్యానికి గురైన పైలెట్.. వెంటనే ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. అయితే కొంత దూరం ప్రయాణించిన ఆ చుక్కలు.. ఒక్కసారిగా అదృశ్యమవుతాయి. అవి ఏలియన్స్ యూఎఫ్‌వోలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. యూఎఫ్‌వోలకు సంబంధించిన వీడియోలు గతంలో చాలా సార్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు.