35వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం.. ఒక్కసారిగా దభేల్ మని శబ్ధం.. అద్దం పగలడంతో అంతా ఆశలు వదులుకున్నారు.. అయితే..

ABN , First Publish Date - 2021-12-31T21:55:28+05:30 IST

నేల పైన ఏదైనా ప్రమాదం జరుతుందని తెలిస్తే.. అటో ఇటో పరుగెత్తి తప్పించుకోవచ్చు. కానీ ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 35వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానానికి ప్రమాదం జరిగింది. ఇక ఆ ప్రయాణికుల పరిస్థితి ..

35వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం.. ఒక్కసారిగా దభేల్ మని శబ్ధం.. అద్దం పగలడంతో అంతా ఆశలు వదులుకున్నారు.. అయితే..
ప్రతీకాత్మక చిత్రం

నేల పైన ఏదైనా ప్రమాదం జరుతుందని తెలిస్తే.. అటో ఇటో పరుగెత్తి తప్పించుకోవచ్చు. కానీ ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 35వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానానికి ప్రమాదం జరిగింది. ఇక ఆ ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో.. ఒక్కసారి ఊహించుకోండి. క్రిస్మస్ జరుపుకొందామని ఆనందంగా వెళ్తున్న సుమారు 200మంది.. చివరికి జీవితంపైనే ఆశలు వదులుకున్నారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ విలపిస్తూ ఉన్నారు. మరోవైపు విమానాన్ని సురక్షితంగా దించేందుకు పైలట్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. చివరికి ఏమైందంటే...


బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 777 విమానం.. డిసెంబర్ 22న లండన్‌లోని గాట్విక్ నుంచి 200మంది ప్రయాణికులతో బయలుదేరింది. కోస్టారికాలోని శాన్ జోస్‌‌కు‌ డిసెంబర్ 23సాయంత్రంలోగా చేరుకుని.. మళ్లీ అక్కడి నుంచి 25 సాయంత్రం లోగా లండన్‌కు వెళ్లాల్సి ఉంది. క్రిస్మస్ సందర్భంగా తమ బంధువులను కలుసుకునేందుకు ప్రయాణికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. విమానం 35వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. ప్రయాణికులంతా కుశల ప్రశ్నలు వేసుకుంటూ సరదగా ఉన్న సమయంలో హఠాత్తుగా దభేల్ మని శబ్ధం వినిపించింది. ఒక్కసారిగా విమానం మొత్తం ఒక కుదుపునకు లోనైంది. ఏం జరుగుతందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పటిదాకా ఆనందంగా ఉన్న ప్రయాణికులు.. ఒక్కసారిగా భయంతో వణికిపోయారు.

ఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఈ విమానానికి 1000అడుగుల ఎత్తులో మరో జెట్ విమానం వెళ్తోంది. ఆ విమానం పైనుంచి ఓ మంచుగడ్డ వేగంగా దూసుకొచ్చి.. బోయింగ్777 పై పడింది. దీంతో విమానం విండ్‌స్క్రీన్‌ బీటలు వారింది. రెండు అడుగుల మందం ఉన్న బుల్లెట్ ఫ్రూం అద్దం కూడా దెబ్బతినడంతో ప్రయాణికులంతా ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. అయితే అద్దం పూర్తిగా పగలకపోవడంతో పైలట్లు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సమీపంలోని విమానాశ్రయానికి సమాచారం అందించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు చేశారు.

ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు.. భర్తతో విడిపోయి ఒంటిరి జీవితం.. చివరగా జిమ్ ట్రైనర్ పరిచయంతో..


పైలట్ల ప్రయత్నాలు ఫలించి.. సమీపంలోని ఓ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం మరమ్మతుల కారణంగా ఆలస్యమవడంతో ప్రయాణికులు.. క్రిస్మస్‌ను జరుపుకోలేకపోయారు. అయినా ప్రాణాలు దక్కినందుకు అంతా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తర్వాత ప్రయాణికులకు బ్రిటిష్ ఎయిర్‌వేస్ క్షమాపణలు చెప్పింది. నిబంధనల మేరకు.. ప్రయాణికులకు నష్టపరిహారాన్ని చెల్లించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మండపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చిన వధువు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన పాకిస్తానీ పెళ్లికూతురు..

Updated Date - 2021-12-31T21:55:28+05:30 IST