Advertisement
Advertisement
Abn logo
Advertisement

భార్యతో వేగలేక పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త.. అతడి ఆరోపణలు విని అవాక్కయిన పోలీసులు..!

కుంటుంబంలో సమస్యలు తలెత్తడం, మళ్లీ సర్దుకుపోవడం ఇదంతా రొటీన్‌గా జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఆ సమస్యలు.. చిలికిచిలికి గాలివానగా మారి భార్యభర్తల మధ్య విడాకుల వరకూ దారి తీస్తుంది. భర్త కొడుతున్నాడనో, అత్తమామలు వేధిస్తున్నారనో.. ఇలా వివిధ సమస్యలతో మహిళలు పోలీసులను ఆశ్రయించడం చూస్తుంటాం. అయితే విచిత్రంగా భార్య మీద ఫిర్యాదు చేయడానికి.. ఓ భర్త ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అదికూడా వెక్కివెక్కి ఏడుస్తూ వెళ్లి తన భార్యపై ఫిర్యాదు చేశాడు. అతడి ఆరోపణలు విని పోలీసులు కూడా అవాక్కయ్యారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎక్కడ జరిగిందనే వివారాలు లేకున్నా.. వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు వెక్కి వెక్కి ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. ఎంత సముదాయించినా చిన్న పిల్లాడిలా ఏడుస్తూనే ఉన్నాడు. ఏం జరిగిందని పదే పదే అడగ్గా.. కొంచెం సేపయ్యాక అతడి సమాధానం విని పోలీసులు అవాక్కయ్యారు. ఇలాంటి ఫిర్యాదులు కూడా ఉంటాయా.. అనుకుంటూ నవ్వుకున్నారు. ఇతను చాలా విచిత్రంగా ఉన్నట్టున్నాడే అనుకుంటూ సర్దిచెప్పి పంపించారు.

తమకు ఇటీవల వివాహం అయిందని.. కొన్నాళ్లు భార్య ఎంతో ప్రేమగా ఉండేదని చెప్పాడు. అయితే ఇటీవల తనను వేధించడం మొదలెట్టిందన్నాడు. ఎదురు ప్రశ్నిస్తే కొడుతోందని బోరుమన్నాడు. రోజూ ఏదో ఒక సాకు చూపి తనను చిత్రహింసలకు గురిచేస్తోందని ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. ఆమెను తాను ఎదిరించలేకున్నానని, అలాగని వీధిలో అందరికీ చెప్పకోలేకపోతున్నానని తెలిపాడు. అయితే రోజురోజుకూ తన మీద దాడి పెరుగుతోందని, దీంతో తట్టుకోలేక పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి సమస్య విన్న పోలీసులు అవాక్కయ్యారు. సమస్యలు వస్తుంటాయని, సర్దుకుపోవాలని సూచించారు. అయినా అతడు వినకపోవడంతో ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement