Advertisement
Advertisement
Abn logo
Advertisement

పీఆర్సీ విషయంలో పునరాలోచించాలి


 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తి

 భోగి మంటల్లో ప్రతులను వేసి నిరసన

గుజరాతీపేట, జనవరి 14: పీఆర్సీ విషయంలో ప్రభుత్వం పునరాలోచించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామ ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. శుక్రవారం కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటుచేసిన భోగి మంటల్లో పీఆర్సీ ప్రతులను వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర మాట్లాడుతూ అశుతోష్‌ మిశ్రా నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరించడం దారుణమన్నారు. దీనిని అందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఐక్య పోరా టాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమా లు కొనసాగాయి. పెద్దఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.Advertisement
Advertisement