Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీమా కంపెనీల ప్రైవేటీకరణ ఆపాలి

ఆచార్య కె.ఎస్‌.చలం, అజశర్మల డిమాండ్‌

బీమా ఉద్యోగుల నిరసనలో పాల్గొని గళం

విశాఖపట్నం, డిసెంబరు 3: ప్రభుత్వ రంగ బీమా కంపెనీల (సాధా రణ) ప్రైవేటీకరణ ఆపాలని, బీమా ప్రీమియంపై జీఎస్టీ రద్దు చేయాలని ద్రావిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి కె.ఎస్‌.చలం, ఎఫ్‌డీఎన్‌ఏ కార్యదర్శి అజశర్మలు డిమాండ్‌ చేశారు. జీవిత బీమా సంస్థలో వాటాల విక్ర యానికి వ్యతిరేకంగా ఐసీఈయూ విశాఖ శాఖ ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్‌ లోని ఎల్‌ఐసీ భవనం ఎదుట శుక్రవారం నిరసన, కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు.


ఈ సందర్భంగా వీరిరువురూ మాట్లాడుతూ బీమా రంగంలో ఎఫ్‌డీఏ పరిమితి 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వ రంగ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీల ప్రైవేటీకరణను ఆపాలన్నారు. పబ్లిక్‌ సెక్టార్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీల ప్రైవేటీకరణ దేశ ప్రయోజనాలకు భంగకరమని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఐసీఈయూ ప్రధాన కార్యదర్శి జి.వర ప్రసాద్‌, అధ్యక్షురాలు ఎం.కామేశ్వరి, మీడియా ఇన్‌చార్జి ఎ.రామకృష్ణ, సతీష్‌పూర్ణిమ, శ్రీనివాస్‌, ఉద్యోగులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement