ముదిరాజ్‌ల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-10-18T05:39:55+05:30 IST

ముదిరాజ్‌ కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర నాయకుడు నక్క శ్రీను కోరారు. ముదిరాజ్‌ మహాసభ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఆదివారం సంఘం జెండాను ఎగురవేశారు. ముదిరాజ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపా

ముదిరాజ్‌ల సమస్యలు పరిష్కరించాలి
అనంతగిరి మండలంలో నివాళులర్పిస్తున్న ముదిరాజ్‌ సంఘం నాయకులు

సూర్యాపేటటౌన్‌/అనంతగిరి, అక్టోబరు 17: ముదిరాజ్‌ కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర నాయకుడు నక్క శ్రీను కోరారు. ముదిరాజ్‌ మహాసభ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఆదివారం సంఘం జెండాను ఎగురవేశారు. ముదిరాజ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. సంఘం బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కోల నాగరాజు, గుంటి సైదులు, సారగండ్ల మాణికమ్మ, మోర మల్సూర్‌, ఇండ్ల వీర య్య, అర్వపల్లి లింగయ్య, నక్కరబోయిన లింగయ్య, నల్లమేకల చినబిక్షం, యాదగిరి, పాల్గొన్నారు. అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగారంలో ముదిరాజ్‌ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ మత్స్య శాఖ చైర్మన్‌ కంటు నాగార్జున, నాయ కులు తమ్మనబోయిన రామయ్య, బాసబోయిన భాస్కర్‌రావు, చింతకాని ఉపేందర్‌, వెంకన్న, చాపల శ్రీను, నర్సయ్య, ఐతబోయిన వెంకటేశ్వర్లు, అల్లి వీరబాబు, శ్రీనివాస్‌రావు, వీరనాగులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T05:39:55+05:30 IST