ఆస్తిపన్ను పెంపును వెంటనే రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-06-18T04:52:51+05:30 IST

కేంద్ర ప్రభుత్వం సూచనకు జగన్‌ ప్రభుత్వం తలొగ్గి, అస్తిపన్నుతో పాటు నీటిపన్ను, చెత్తపన్ను పెంపునకు జారీ చేసిన నోటిఫికేషన్‌ వెంటనే రద్దు చే యాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

ఆస్తిపన్ను పెంపును వెంటనే రద్దు చేయాలి
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న పట్టణ పౌరసమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు సత్యనారాయణ

 రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రజాసంఘాలు

ప్రొద్దుటూరు క్రైం, జూన్‌ 17 : కేంద్ర ప్రభుత్వం సూచనకు జగన్‌ ప్రభుత్వం తలొగ్గి, అస్తిపన్నుతో పాటు నీటిపన్ను, చెత్తపన్ను పెంపునకు  జారీ చేసిన నోటిఫికేషన్‌ వెంటనే రద్దు చే యాలని ప్రజాసంఘాల నేతలు  డిమాండ్‌ చేశారు. ఈ మేర కు గురువారం మున్పిపల్‌ కార్యాలయం సమీపంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆస్తిపన్ను పెంపును నిరసి స్తూ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిఽథిగా పట్టణ పౌరసమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.సత్యనారాయణ, సీపీఎం పట్టణ కమిటీ సభ్యుడు ఫకీరయ్య, సీఐటీయూ కార్యదర్శి విజయకుమార్‌, ఎలక్ట్రికల్‌ యూనియన్‌ కార్యదర్శి ఓబులేసు, ఆటో యూనియన్‌ నాయకుడు అల్లాబకష్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కమిటీ సభ్యుడు మారుతి, మున్సిపల్‌ యూనియన్‌ నాయకుడు చంటి, రైతు సంఘం నాయకులు చెన్నారెడ్డి, సుబ్బారావు, సుబ్బయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా రాష్ట్రాల్లో అక్కడి పాలకులు ప్రజలకు వెసులుబాటు కలిగిస్తూ వివిధ రకాల పన్నులు తగ్గిస్తుంటే, ఏపీలో మాత్రం అప్పు ఇచ్చే నేపథ్యంలో ఆస్తిపన్ను పెంచాలని కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు  పన్నులు పెంచడం దారుణమన్నారు.  వెంటనే అస్తిపన్ను పెంపుపై తీసుకొచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేయాలని లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. సమావేశానికి పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:52:51+05:30 IST