Abn logo
Oct 18 2021 @ 00:17AM

నిరసన ర్యాలీని విజయవంతం చేయాలి

ర్యాలీ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జేఏసీ నేతలు


పాడేరు, అక్టోబరు 17: ప్రభుత్వ వెబ్‌సైట్‌ల్లో ఎస్‌టీ తెగల తొలగింపునకు నిరసనగా ఈనెల 27న పాడేరులో నిర్వహించే నిరసన ర్యాలీను ప్రజలంతా విజయవంతం చేయాలని ఆదివాసీ జేఏసీ కన్వీనర్‌ రామారావుదొర కోరారు. స్థానిక గిరిజన ఉద్యోగుల భవన్‌లో ఆదివారం ‘27 నిరసన ర్యాలీ’ పోస్టర్‌ను జేఏసీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామారావుదొర మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పఽథకం ప్రకారం అధికారిక వైబ్‌సైట్‌లలో ఆదివాసీ తెగల పేర్లను తొలగిస్తుందన్నారు. దీనివల్ల రాజ్యాం గపరంగా ఆదివాసీలకు దక్కే ఫలాలు దక్కకుండా పోతాయన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈనెల 27న తలపెట్టిన ర్యాలీలో ప్రజలు, విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు పాల్గొనాలని కోరారు. ఈకార్యక్రమంలో జేఏసీ నేతలు గంగన్నపడాల్‌, నాగభూషణరాజు, శ్రీనివాసపడాల్‌, రామారావు, నీలకంఠం, శాంతి. లక్ష్మి పాల్గొన్నారు.