రుయా ఘటన మానవహక్కుల ఉల్లంఘన

ABN , First Publish Date - 2021-05-15T06:06:00+05:30 IST

తిరుపతిలోని రుయాస్పత్రిలో ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ బాధితులు మృతిచెందిన ఘటన మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ప్రఫుల్ల చంద్రకు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌ శుక్రవారం లేఖ రాశారు.

రుయా ఘటన మానవహక్కుల ఉల్లంఘన

జాతీయ మానవహక్కుల చైర్మన్‌కు చింతా మోహన్‌ లేఖ

తిరుపతి, మే14 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని రుయాస్పత్రిలో ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ బాధితులు మృతిచెందిన ఘటన మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ప్రఫుల్ల చంద్రకు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌ శుక్రవారం లేఖ రాశారు. ఈ సంఘటనలో సుమారు 30 మంది చనిపోయారన్నారు. బాధ్యులపై కేసునమోదు చేసి దర్యాప్తు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆ లేఖలో ఆయన కోరారు.

Updated Date - 2021-05-15T06:06:00+05:30 IST