పోలీసు అమరుల త్యాగాలు మరవలేనివి

ABN , First Publish Date - 2021-10-22T07:08:03+05:30 IST

పోలీస్‌ అమరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి కొనియాడారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

పోలీసు అమరుల త్యాగాలు మరవలేనివి
సంస్మరణ దినోత్సవంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

పోలీసుల కృషి వల్లే అదుపులో శాంతిభద్రతలు 

అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేట క్రైం, అక్టోబరు 21: పోలీస్‌ అమరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి కొనియాడారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది పోలీసుల కృషే అన్నారు. వారు రేయింబవళ్లు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించడం వల్లే శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. పోలీ్‌సశాఖలో ఉద్యోగానికి యువతీ యువకులు ముందుకు రావాలన్నారు. పోలీస్‌ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామన్నారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, పోలీస్‌ అమరవీరులకు అందించే నివాళులు వారి కుటుంబాల్లో మానసిక బలాన్ని పెంపొందిస్తాయన్నారు. వారి సంక్షేమానికి జిల్లా పోలీస్‌శాఖ కట్టుబడి ఉంటుందన్నారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనాన్ని వారు స్వీకరించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీ్‌సశాఖ కళాజాత బృందం అలపించిన గేయాలు ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో డీఎస్పీ రవి, సీఐలు ఆంజనేయులు, శ్రీనివాస్‌,నర్సింహ, గోవిందరాజు, పోలీసుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

పోలీస్‌ కుటుంబాల సంక్షేమానికి భరోసా : ఎస్పీ 

పోలీస్‌ కుటుంబాల సంక్షేమానికి భరోసా కల్పిస్తామని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. హుజూర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతిచెందిన కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ కుటుంబ సభ్యులకు పోలీస్‌ భద్రత స్కీం ద్వారా మంజూరైన రూ.4లక్షల చెక్కును జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధులు నిర్వహిస్తూ అకాలమరణం పొందిన సిబ్బందికి పోలీస్‌ భద్రత స్కీం బాసటగా నిలుస్తోందన్నారు.

Updated Date - 2021-10-22T07:08:03+05:30 IST