Advertisement
Advertisement
Abn logo
Advertisement

గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది

ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ 

హుస్నాబాద్‌, నవంబరు 29 : శ్రీరాంసాగర్‌ వరద కాలువ గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌ పట్టణంలోని కరీంనగర్‌ రోడ్డులో భూ నిర్వాసితుల నూతన గృహాల నిర్మాణానికి ఆయన భూమి పూజచేసి మాట్లాడారు. మిగతా రైతులు కూడా ముందుకొచ్చి రిజర్వాయర్‌ నిర్మాణానికి సహకరించాలని కోరారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ ఎన్నోఏళ్ల రైతుల కల అని, ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తవుతుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి రైతులు పెద్ద మనసుతో భూములు ఇచ్చారని, వారిని అన్నివిధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని, తాగు, సాగునీటికి ఇక ఇబ్బంది ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, గోవింద్‌, రవి, డాక్టర్‌ రవి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement