సర్పంచల చేతికి తాళాలొచ్చాయ్‌!

ABN , First Publish Date - 2021-06-14T06:49:05+05:30 IST

ఎట్టకేలకు పంచాయతీ సర్పంచల చేతికి చెక్‌ పవర్‌ దక్కింది. దీంతో పంచాయతీల్లో నిధులు ఖర్చు చేసుకునే వెసులుబాటు కలిగింది.

సర్పంచల చేతికి తాళాలొచ్చాయ్‌!
ఉరవకొండ పంచాయతీ కార్యాలయం

చెక్‌ పవర్‌కు తొలగిన అడ్డంకులు


ఉరవకొండ, జూన 13: ఎట్టకేలకు పంచాయతీ సర్పంచల చేతికి  చెక్‌ పవర్‌ దక్కింది. దీంతో పంచాయతీల్లో నిధులు ఖర్చు చేసుకునే వెసులుబాటు కలిగింది. నియోజకవర్గంలో 86 పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీలకు ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరిగాయి. మార్చిలో పాలక వ ర్గాలు కొలువుతీరాయి. సర్పంచులకు చెక్‌ పవర్‌ లేక పోవడంతో అభివృద్ధిపనులకు ఇబ్బందులు ఏర్పడేవి. పంచాయతీల్లో సాధారణ, 15వ ఆర్థికసం ఘం నిధులు ఉన్నప్పటికి ఒక్క రూపాయి ఖర్చుచేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేక పోయారు. ఈనేపథ్యంలో ఏప్రిల్‌ నుంచి కొవిడ్‌ విస్తరిం చడంతో పారిశుధ్య పనులకు నిధులు లేక ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు సర్పంచుల ఆధార్‌, బ్యాంకు ఖాతాలను సీఎ్‌ఫఎంఎస్‌కు లింక్‌ చేయడంతో చెక్‌ పవర్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. నియోజకవర్గంలో 86 పంచాయతీలు ఉండగా, ఉరవకొండ, విడపనకల్లులో 17, బెళుగుప్ప, వజ్రకరూరులో 19, కూడేరు మండలంలో 14 పంచాయతీలు ఉన్నాయి. ఉరవకొండ, కూడేరు మండల్లాలోని పంచాయతీ సర్పంచలు అందరికీ చెక్‌ పవర్‌ వచ్చిం ది. ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కలిసి ఆ పం చాయతీలో ఉన్న నిధులను ఖర్చు చేసుకునే అవకాశముంది.


నిబంధనల మేరకే నిధుల చెల్లింపు

ప్రస్తుతం  సాధారణ, 15వ ఆర్థిక సంఘం నిధులు కలిపి రూ.5 లక్షలు పైబడి ఉన్నాయి. ఈ నిధులను సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్య పనులు చేపట్టేందుకు, వీధి దీపాల మరమ్మతులకు వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ నిధులు ఖర్చు చేయాలంటే కొన్ని నిబంధనలుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా తాగునీరు, పారిశుధ్యం పనులకే నిధులు మంజూరు చేస్తారు. సాధారణ నిధులు రూ.2 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3 లక్షలు ఉంటాయి. సర్పంచ గ్రామాలలో చేసిన పనికి రూ.3 లక్షలు బిల్లు పెడితే వెంటనే వారి ఖాతాల నుంచి డ్రా చేయడం కుదరదు. ఆనలైనలో సర్పంచు వేలిముద్ర ద్వారా పంచాయతీ కార్యదర్శి బిల్లులు స మర్పిస్తే సీఎ్‌ఫఎంఎస్‌ నుంచి నిబంధనల మేరకే నిధులు చెల్లిస్తారు. స ర్పంచు బ్యాంకు ఖాతాకు జమ అవుతుంటాయి. బెళుగుప్ప మండలంలో శీ ర్పి పంచాయతీకి సాంకేతిక కారణాలతో ఇంకా చెక్‌ పవర్‌ రాలేదు. విడపనకల్లు మండలంలో 17 పంచాయతీలకు చెక్‌ పవర్‌ రాలేదు. రెండు, మూ డు రోజుల్లో వారికి చెక్‌ పవర్‌ వస్తుందని అధికారులు తెలిపారు. 


మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు అవకాశం:

దామోదర్‌ రెడ్డి, ఎంపీడీఓ 

గ్రామాల్లో మౌళిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు ఇది మంచి అవకాశం. నిబంధనలకు లోబడే నిధులు ఖర్చుచేయాల్సి ఉంటుంది. మండలం లో అంద రి సర్పంచులకు ఐడీలు కేటాయించాం. తాగునీరు, పారిశుధ్యం స దుపాయాల కల్పన వంటి పనులు చేపట్టి వెంటనే బిల్లులు చెల్లించే అవకాశముంటుంది. 

Updated Date - 2021-06-14T06:49:05+05:30 IST