పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-10-24T04:18:58+05:30 IST

పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని పోలీస్‌స్టేషన్‌ నుంచి ఐబీ చౌరస్తా వరకు 2కే రన్‌ నిర్వహించారు.

పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం
2కే రన్‌లో పాల్గొన్న డీసీపీ, ఏసీపీ, డీవైఎస్‌వో

ఏసీసీ, అక్టోబరు 23: పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని పోలీస్‌స్టేషన్‌ నుంచి ఐబీ చౌరస్తా వరకు 2కే రన్‌ నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ విరామం లేకుండా విధి నిర్వహణ చేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిషలు కృషి చేసే పోలీసు సిబ్బంది సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. సమాజంలో ఎవరికి ఏ ఇబ్బంది తలెత్తినా మొదట ఆశ్రయించేది పోలీసులనే అని గుర్తు చేశారు. ఏసీపీ అఖిల్‌మహాజన్‌, పట్టణ సీఐ నారాయణనాయక్‌, ఎస్‌ఐలు ప్రవీణ్‌కుమార్‌, దేవయ్య, కిరణ్‌, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, స్వచ్చంద సంస్థల సభ్యులు, యువకులు పాల్గొన్నారు. 

దండేపల్లి:  యువకులు సన్మార్గంలో నడిచినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎస్సై తాళ్ళ శ్రీకాంత్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా శనివారం దండేపల్లి నుంచి మ్యాదరిపేట వరకు 2కే రన్‌ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.  ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల ఆవరణలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు 

జన్నారం: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా  శని వారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఎస్‌ఐ మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో 2కే రన్‌ నిర్వహించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ పోలీసులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారన్నారు.

 

Updated Date - 2021-10-24T04:18:58+05:30 IST