ఫోన్ వచ్చిందని రాత్రి బయటకు వెళ్లిన 25 ఏళ్ల కుర్రాడు.. తెల్లారేసరికి రైల్వే బ్రిడ్జ్ కింద శవంగా.. 19 ఏళ్ల ఆ కుర్రాడి పనేనని..
ABN , First Publish Date - 2022-05-27T21:28:34+05:30 IST
చాలా వరకు హత్యలు.. ఆర్థిక, ప్రేమ వ్యవహారాల కారణంగానే జరుగుతున్నాయి. పరువు తీశారనే కోపంతో పిల్లలను తల్లిదండ్రులే హత్య చేయడం చూశాం. అలాగే ఆస్తి వ్యవహారాల్లో సొంత..
చాలా వరకు హత్యలు.. ఆర్థిక, ప్రేమ వ్యవహారాల కారణంగానే జరుగుతున్నాయి. పరువు తీశారనే కోపంతో పిల్లలను తల్లిదండ్రులే హత్య చేయడం చూశాం. అలాగే ఆస్తి వ్యవహారాల్లో సొంత అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకోవడం కూడా రోజూ చూస్తున్నాం. ఇటీవల ప్రేమికుల విషయంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడడం ఎక్కువైంది. కర్నాటకలో దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు ఫోన్ వచ్చిందని రాత్రి బయటికి వెళ్లాడు. అయితే తెల్లారేసరికి రైల్వే బ్రిడ్జ్ కింద శవంగా మారాడు. 19 ఏళ్ల కుర్రాడే ఈ హత్య చేశాడని అంతా భావించారు. చివరకు అదే నిజమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
కర్నాటక రాష్ట్రం భీమా నగర్ లేఅవుట్‌కు చెందిన విజయ్ కాంబ్లే అనే వ్యక్తికి స్థానిక ప్రాంతానికి చెందిన ముస్లిం యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో ఇంట్లో ఒప్పుకోరనే ఉద్దేశంతో ఎవరికీ తెలీకుండా కలుసుకునేవారు. ఆరు నెలల క్రితం వీరి ప్రేమ విషయం యువతి సోదరుడు షహబుద్దీన్‌కు తెలిసింది. దీంతో విజయ్ వద్దకు వెళ్లి.. ‘‘ఇంకోసారి మా అక్కతో మాట్లాడితే బాగుండదు’’.. అంటూ హెచ్చరించి వెళ్లాడు. అయితే విజయ్ మాత్రం షహబుద్దీన్ చెల్లెలితో తరచూ మాట్లాడుతూ ఉండేవాడు. దీంతో విజయ్‌పై షహబుద్దీన్.. పగ పెంచుకున్నాడు. ఎలాగైనా విజయ్‌ని అంతమొందించాలని సమయం కోసం వేచి చూస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో మే 25న విజయ్‌కి ఫోన్ చేసి.. ‘‘నీతో మాట్లాడాలి, ఊరి బయటికి రా’’.. అని చెప్పడంతో విజయ్ అక్కడికి వెళ్లాడు. షహబుద్దీన్, అతని స్నేహితుడు నవాజ్ కలిసి.. విజయ్‌ని గ్రామ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కిందకు తీసుకెళ్లారు.
America లో భర్తకు జాబ్.. ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా కాపురానికి తీసుకెళ్లకపోవడంతో ఆ భార్య అనుమానంతో ఆరా తీస్తే..
అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా విజయ్‌పై ఆయుధాలు, రాళ్లు, ఇటుకలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన విజయ్.. అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. షహబుద్దీన్‌పై మృతుడి తల్లితో పాటూ స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు బలగాలను రంగంలోకి దించారు.