Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజల ఉసురు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

 బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి

 పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌

 పట్టణాల్లో నిరసన ర్యాలీలు


గజ్వేల్‌, నవంబరు 30: పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉసురు తీస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపు మేరకు పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం గజ్వేల్‌ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు నలగామ శ్రీనివా్‌స పాల్గొని, మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకుండా ప్రజలపై భారాన్ని మోపుతుందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు యెల్లు రాంరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్‌యాదవ్‌, పేర్ల శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి కుడిక్యాల రాములు, ఎల్కంటి సురేశ్‌, మధుసూదన్‌, మహేశ్‌, శ్రీకాంత్‌, రమేశ్‌, గొడుగు కుమార్‌, నత్తి శివకుమార్‌, మన్నె శేఖర్‌, ఆర్కే, గుర్రం శ్రీధర్‌, ప్రభాకర్‌, ఎగొండ, శంకర్‌, నాగరాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

చేర్యాల: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేర్యాల తహసీల్దార్‌కు నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు పాండు, పట్టణ అధ్యక్షుడు సురేందర్‌, నాయకులు రామదాసు, బాలరాజు, సంజీవులు, భావనారుషి, సంజీవరెడ్డి, వెంకటేశం, బాబు, సిద్దులు, మహేష్‌ పాల్గొన్నారు. 


పలు మండల కేంద్రాల్లో


సిద్దిపేట రూరల్‌: పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని కోరుతూ బీజేపీ నాయకులు మంగళవారం సిద్దిపేట రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రూరల్‌ మండలాధ్యక్షుడు మల్లమ్మగారి శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు యాదగిరి, పిట్ల కనకయ్య, కలకుంట్ల నవీన్‌, కమ్మ శ్రీనివాస్‌, వనం పర్శరాములు, హేమంత్‌, విష్ణు, అజయ్‌ పాల్గొన్నారు.

హుస్నాబాద్‌: పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ హుస్నాబాద్‌ పట్టణంలో బీజేపీ నాయకులు ట్రాలీ ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు చెక్కబండి విద్యాసాగర్‌, బత్తుల శంకర్‌బాబు, జిల్లా కోశాధికారి దొడ్డి శ్రీనివాస్‌, బాణాల విజయలక్ష్మి, బద్దిపడగ జైపాల్‌రెడ్డి, కాయిత అరుణ్‌రెడ్డి, కందుకూరి సతీష్‌, బోనగిరి రవి, రవీందర్‌గౌడ్‌, పెరుమాండ్ల శ్రీనివాస్‌, సాగర్‌, కురిమెల్లి శ్రీనివాస్‌, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 

అక్కన్నపేట: తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్‌, నాయకులు జంగపల్లి శ్రీనివాస్‌, జనగామ వేణుగోపాలరావు, భూక్య సుధాకర్‌, జన్నారపు కళ్యాణ్‌విష్ణు, కొయ్యడ కార్తీక్‌, సురేష్‌ రైనా తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement
Advertisement